Sunday, February 25, 2018

అద్భుతమైన రేడియో టెలిస్కోప్ లు....ఫోటోలు


ప్రపంచవ్యాప్తంగా అమర్చిన అద్భుతమైన రేడియో టెలిస్కోప్ లను ఇక్కడ చూడొచ్చు. ఈ రేడియో టెలిస్కోప్ లు పనేమిటో?....అంతరిక్షాన్ని సర్వే చేస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఉపగ్రహల నుండి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఖగోళ శాస్త్రంలో ఉపయోగించే ప్రధాన పరిశీలనా పరికరం ఈ రేడియో టెలిస్కోప్.


ప్రకృతి అందాలు....ఫోటోలు


Tuesday, February 20, 2018

లాభాలను ప్రజలకు పంచిపెడుతున్న సింగపూర్ ప్రభుత్వం.....ఫోటోలు మరియు వివరాలు

లాభాలను ప్రజలకు పంచిపెడుతున్న సింగపూర్ ప్రభుత్వం.


మనం, అంటే భారతీయులందరం దేశంలో చోటుచేసుకున్న కోట్లాది రూపాయల కుంభకోణాల గురించి చదువుతూ, దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న కుంభకోణాల గురించి తెలుసుకుంటుంటే, సింగపూర్ ప్రభుత్వం ఈ ఆర్ధీక సంవత్సరంలో తెచ్చుకున్న లాభాలలో నుండి ప్రతి సింగపూర్ సిటిజన్ కు కొంత డబ్బును బోనస్ గా అందివ్వాలని ప్లాన్ వెస్తున్నారట.


సంవత్సరానికి 28,000 సింగపూర్ డాలర్లు సంపాదించుకుంటున్న వారికి 300 సింగపూర్ డాలర్లు (రూ. 14,709.60), 28,001 నుండి 1,00,000 సంపాదించుకుంటున్న వారికి 200 సింగపూర్ డాలర్లు, 1,00,000 పైన సంపాదించుకుంటున్నవారికి 100 సింగపూర్ డాలర్లు ఇవ్వాలనుకుంటున్నారట.

సింగపూర్అ ర్ధీక మంత్రి Heng Swee Keat

అవును. మీరు వింటున్నది నిజమే!


ఈ ఆర్ధీక సంవత్సరం సింగపూర్ ప్రభుత్వానికి, వేసుకున్న బడ్జెట్ కంటే 10 బిల్లియన్ సింగపూర్ డాలర్ల లాభం వచ్చిందట. ఆ లాభాలను ప్రజలతో పంచుకోవాలని సింగపూర్ ప్రభుత్వం తీర్మానించుకున్నదట.


ఆ దేశ అర్ధీక మంత్రి Heng Swee Keat ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపినట్లు హిందూస్తాన్ టైంస్ న్యూస్ పేపర్ తెలిపింది.