Wednesday, January 31, 2018

నిజమైన పిల్లల రైల్వే.....ఫోటోలు


పిల్లల రైల్వే అన్నవెంటనే అమ్యూజ్ మెంట్ పార్కులలో ఉండే బొమ్మ రైళ్ళు, రైల్వే లైను అనుకునేరు. ఇది నిజమైన రైలు. ఈ రైలులో పయనించే ప్రయాణీకులు పిల్లలు కాదు నిజమైన పర్యాటకులు. ఇక్కడ పిల్లలు రైల్వే ఉద్యోగులు.

11.2 కిలో మీటర్ల పొడవుగల ఈ రైల్వే లైను హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్ లో ఉన్నది. ఇక్కడ రైల్వేను పిల్లలే నుడుపుతారు(పెద్దల పర్యవేక్షణలో). టికెట్ కౌంటర్లో టికెట్లు ఇవ్వటం దగ్గర నుండి, ప్రయాణీకులకు కావలసిన సమాచారం, రైల్వే అనౌన్స్ మెంట్లు, టికెట్ కలెక్టర్స్, టికెట్ చెకింగ్, లైన్లు మార్చడం, సిగ్నల్ వెయడం వరకు పిల్లలే చేస్తారు.


No comments:

Post a Comment