Tuesday, January 30, 2018

డ్రైవర్ అక్కర్లేని కార్లు....ఫోటోలు


కారు డ్రైవ్ చేయడం చేతకాదనే బాధ అవసరం లేదు. టైమ్ కి డ్రైవర్ లేడనే బెంగ కూడా అవసరం లేదు. ఎందుకంటే డ్రైవర్ లెస్ కార్లు వచేశాయి. కారు వాడాలనుకున్న వారి ప్రాబ్లమ్స్ కి సొల్యుషన్ డ్రైవర్ లెస్ కార్లు. మీరు కోరుకున్న చోటికి దర్జాగా తీసుకెళ్తుంది. పైగా నో రిస్క్. మార్కెట్లో వచ్చే ఇన్నోవేషన్ లకు ఇది సరికొత్త ఇన్నోవేషన్.

డ్రైవర్ లేకుండా ఎలా నడుస్తుంది?...దీని మెకానిజమ్...హ్యూమన్ డ్రైవర్ కన్నా ఫాస్ట్ గా గుర్తించే రాడర్, సెన్సర్ సిస్టం కార్లలో ఉంటుంది. ఇందులో ఆరు దూరశ్రేణి రాడర్లు, నాలుగు స్వల్ప శ్రేణి రాడార్లు, మూడు లెన్ప్ కెమరాలు, ఆరు లిడార్ సెన్సర్లు అమర్చారు. అద్బుతమైన అల్గారితమ్ సాఫ్ట్ వేర్. అత్యాధునిక డ్రైవ్ అసిస్టెన్స్ దీని సొంతం. ఇవన్నీ ఉండటం వల్ల కారు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. రోడ్డు మీద ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇవీ ఆటోమెటిక్ కార్ ని కంట్రోల్ చేస్తాయి.

కొన్ని దేశాలలో డ్రైవర్ లెస్ బస్సులు కూడా వచ్చేశాయి. మన దేశంలో కూడా త్వరలో ఈ కార్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
2 comments: