Wednesday, January 31, 2018

నిజమైన పిల్లల రైల్వే.....ఫోటోలు


పిల్లల రైల్వే అన్నవెంటనే అమ్యూజ్ మెంట్ పార్కులలో ఉండే బొమ్మ రైళ్ళు, రైల్వే లైను అనుకునేరు. ఇది నిజమైన రైలు. ఈ రైలులో పయనించే ప్రయాణీకులు పిల్లలు కాదు నిజమైన పర్యాటకులు. ఇక్కడ పిల్లలు రైల్వే ఉద్యోగులు.

11.2 కిలో మీటర్ల పొడవుగల ఈ రైల్వే లైను హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్ లో ఉన్నది. ఇక్కడ రైల్వేను పిల్లలే నుడుపుతారు(పెద్దల పర్యవేక్షణలో). టికెట్ కౌంటర్లో టికెట్లు ఇవ్వటం దగ్గర నుండి, ప్రయాణీకులకు కావలసిన సమాచారం, రైల్వే అనౌన్స్ మెంట్లు, టికెట్ కలెక్టర్స్, టికెట్ చెకింగ్, లైన్లు మార్చడం, సిగ్నల్ వెయడం వరకు పిల్లలే చేస్తారు.


Tuesday, January 30, 2018

డ్రైవర్ అక్కర్లేని కార్లు....ఫోటోలు


కారు డ్రైవ్ చేయడం చేతకాదనే బాధ అవసరం లేదు. టైమ్ కి డ్రైవర్ లేడనే బెంగ కూడా అవసరం లేదు. ఎందుకంటే డ్రైవర్ లెస్ కార్లు వచేశాయి. కారు వాడాలనుకున్న వారి ప్రాబ్లమ్స్ కి సొల్యుషన్ డ్రైవర్ లెస్ కార్లు. మీరు కోరుకున్న చోటికి దర్జాగా తీసుకెళ్తుంది. పైగా నో రిస్క్. మార్కెట్లో వచ్చే ఇన్నోవేషన్ లకు ఇది సరికొత్త ఇన్నోవేషన్.

డ్రైవర్ లేకుండా ఎలా నడుస్తుంది?...దీని మెకానిజమ్...హ్యూమన్ డ్రైవర్ కన్నా ఫాస్ట్ గా గుర్తించే రాడర్, సెన్సర్ సిస్టం కార్లలో ఉంటుంది. ఇందులో ఆరు దూరశ్రేణి రాడర్లు, నాలుగు స్వల్ప శ్రేణి రాడార్లు, మూడు లెన్ప్ కెమరాలు, ఆరు లిడార్ సెన్సర్లు అమర్చారు. అద్బుతమైన అల్గారితమ్ సాఫ్ట్ వేర్. అత్యాధునిక డ్రైవ్ అసిస్టెన్స్ దీని సొంతం. ఇవన్నీ ఉండటం వల్ల కారు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. రోడ్డు మీద ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇవీ ఆటోమెటిక్ కార్ ని కంట్రోల్ చేస్తాయి.

కొన్ని దేశాలలో డ్రైవర్ లెస్ బస్సులు కూడా వచ్చేశాయి. మన దేశంలో కూడా త్వరలో ఈ కార్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
వయోవృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం...వివరాలు


వయోవృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం


👉🏻రెండు సమయాలున్నాయి: 1. ఉదయం 10కు. ...2. సాయంత్రం 3కు.

ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రాలు *S 1 counter వద్ద చూపించాల్సి వుంటుంది*

ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే ఉంటుంది ఈ కౌంటర్.

మెట్లు ఎక్కాల్సిన పనిలేదు....మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి.

సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు.

వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.

కౌంటరు నుండి గుడి......గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం.

వీరి దర్శనం కొరకు *మిగతా అన్ని క్యు లు నిలిపివేయబడతాయి*

*ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు*

*30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది*

Information courtesy : TTD.

Monday, January 29, 2018

ఉడుతల కోసం వింటర్ ఒలింపిక్స్.....ఫోటోలు


స్వీడన్ దేశానికి చెందిన 48 సంవత్సరాల Geert Weggen అనే ఫోటోగ్రాఫర్ తన ఇంటి గార్డన్ కు క్రమం తప్పకుండా వస్తున్న ఉడుతల కోసం వింటర్ లో తన ఇంటి గార్డన్ లో వింటర్ ఒలింపిక్ ఆటలలో ఉపయోగించే ఆట పరికరాలలాగా, చిన్న, చిన్న పరికరాలను అమర్చి ఏం జరుగుతుందో చూద్దామని వేచి చూశడు....ఆశ్చర్యం, అక్కడకు వచ్చిన ఉడుతలు ఆ పరికారాలను వాటిని ఎందుకు ఉపయోగిస్తారో, అదేలాగా ఉపయోగించేయట. మెడల్స్ ఇచ్చే స్టాండ్ పై విన్నర్ పొజిషన్ పై కూర్చున్నాయి.

ఫోటో క్రెడిట్: Geert Weggen

Saturday, January 27, 2018

బాలి: ఆకర్షణీయమైన ద్వీపం....ఫోటోలు


బాలి...ఇండోనేషియా లోని ఒక ద్వీపం. ప్రముఖ ప్రపంచ పర్యటక ప్రాంతమైన ఈ ధ్వీపం ప్రాచీన హిందు సంస్కృతికి, ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ 90% హిందువులు ఉన్నారు.

సుమారు 23 కోట్ల ముస్లిం జనాభా గల ఇండొనేసియా దేశంలో 80% హిందువులు నివసించే బాలి ఇప్పుడుకూడా ఒక వింతగా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. 30 లక్షల జనాభా ఉన్న బాలికి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యాటకులు వస్తుండటం విశేషం.

Pura Ulun Danu Bratan

Tanah Lot Temple

Tirta Gangga Water Palace

Besakih Temple

Bajra Sandhi Monument