Tuesday, October 10, 2017

"ప్రతిలిపి కథా భారతి" అవార్డ్.....ఫోటోలు


08.10.2017 అనగా ఆదివారము, విజయవాడలోని Indian Medical Association లో జరిగిన సభలో ప్రతిలిపి online self publishing magazine తెలుగు విభాగం వారు మరియు భువన విజయము (తెలుగు భాష పరివ్యాప్తి కోసం అవతరించిన సభ) నాకు ' కథా భారతి ' అన్న బిరుదును ,జ్నాపిక తో పాటు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.

నా కథలు 22 దాకా ప్రతిలిపి లో ప్రచురించబడ్డాయి.

తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, భువన విజయం వ్యవస్థాపకులు శ్రీ చంద్ర శేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ మెంబర్ శ్రీమతి శిరిగినీడి రాజ్యలక్ష్మి గారు, దూర దర్షన్ వ్యాఖ్యాత శ్రీమతి విజయ దుర్గ గారు, ప్రతిలిపి తెలుగు నిర్వాహకులు శ్రీ జానీ తక్కడ శిల గారు సన్మానించారు.Thursday, October 5, 2017

కాళ్ళూ,చేతులూ లేని ఫోటోగ్రాఫిక్ నిపుణుడు....ఫోటోలు


ఇండోనేషియాకి చెందిన Achmad Zulkarnain కి పుట్టుకతోనే కాళ్ళూ, చేతులు లేవు. అవిటివాడు పుట్టాడే అని బాధ పడకుండా అతని తల్లితండ్రులు అతన్ని ప్రేమతో పెంచారు. ఇప్పుడతనికి 24 సంవత్సరాలు. ఫోటోగ్రాఫీ మీద అభిరుచి పెంచుకున్నాడు. పట్టుదలతో ఫోటోగ్రాఫీ మాత్రమే కాకుండా ఫోటో ఎడీటింగ్ కూడా నేర్చుకున్నాడు.

చేతులులేని ఇతను ఎలా ఇవన్నీ నేర్చుకున్నాడు.....అతను అతని ముఖం, నోరు మరియు మోచేతి చర్మం ను ఉపయోగించి నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను తీసిన ఫోటోలు చూసిన ఆడ్ కంపెనీలు అతను తీసిన ఫోటోలను ఇష్టపడుతున్నారు. అతను తీసిన ఫోటోలు అతని పనితన్నాన్ని ఎత్తి చూపుతున్నాయట....గ్రేట్.

Mr.Achmad Zulkarnain

ఫోటోగ్రాఫిక్ క్లాసులుకు వెళ్ళినప్పుడుఫోటో ఎడీటింగ్ చేస్తున్నప్పుడు


అతను తీసిన ఫోటోలు

తనకోసం తయారు చేసుకున్న కారు

Wednesday, October 4, 2017

యమున నది మరింత కలిషితం....ఫోటోలు


యమున భారతీయులకు పవిత్రమైనది. యమునలో స్నానమాచరిస్తే అకాల మృత్యుదోషం హరించుకుపోతుందని ఒక నమ్మకం. కాని ఢిల్లీలో ఉన్న యమునా నదిలో స్నానమాచరిస్తే మృత్యువు ఖాయం అని అక్కడ ఉన్న కలుషిత యమున హెచ్చరిస్తోంది.

తాజాగా వచ్చిన ప్రభుత్వం యమునను శుభ్రం చేస్తానని ఆర్భాటం చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ యమున బాగోగులు మూడేళ్లలో తేలుస్తామని అన్నది. కాని యమున నది మాత్రం ఢిల్లీలో రోజు రోజుకీ మురికి కూపంగా మారి ప్రజలకు విషం సరఫరా చేస్తోంది. దీని చుట్టుపక్కల పండే ఆకుకూరలు, కూరగాయలు కేన్సర్‌ కారకాలని పరీక్షలు నిర్థారణ చేస్తున్నాయి. యమున విషకాసారం కావడం వల్ల చుట్టుపక్కల పల్లెల్లోని భూగర్భ జలాలు విషతుల్యమై కీళ్ల నొప్పులు, వాతం, ఇతర అనారోగ్యాలు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ పేదసాదలు యమునపై భక్తితో ఈ మురికి యమునలోనే మునకలు వేస్తుంటారు. సంధ్య వారుస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.

ప్రపంచంలో అత్యంత కలుషితమైన పది నదుల్లో ఒకటి యమున. టన్నుల కొద్దీ వ్యర్థాలను ప్రతిరోజు యమున నదిలో పడేస్తున్నారు. చెత్త చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతోపాటు మురికినీళ్ళను యమున నదిలోకి వదులుతున్నారు. దేశ రాజధాని సమీపంలోని యమునా నదిలోనే నగరానికి సంబంధించిన కాలుష్యాన్నంతా వదులుతున్నారు.

యమున నదికి ఇంత ప్రమాదం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటంలేదు.....దీనికి ఉదాహరణే: దసరా పండుగ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో తయారైన దుర్గా దేవి విగ్రహాలను విచ్చలవిడిగా యమున లో కలపటమే. దీని వలన యమున మరింత కలుషితం అవుతోంది.

ఈ విషాదం నుంచి యమున ఎప్పటికి విముక్తమవుతుందో! మానవ పాపాల నుంచి ఎప్పటికి బయట పడుతుందో!!


హోటల్లే టూరిస్ట్ ప్రదేశాలు...ఫోటోలు


మనం టూరిస్టులుగా బయటి ఊర్లకు వెళ్ళినప్పుడు హోటల్లలో ఉంటాము. మంచి హోటల్లు వెతుక్కుంటాము. కానీ హోటల్లే టూరిస్ట్ ప్రదేశాలుగా ఉంటే ఎవరికైనా ఒక సారి అక్కడకు వెళ్ళాలనిపిస్తుంది. కారణం ఆ హోటల్లు అందమైనవిగానో, అపూర్వమైనవిగానో ఉండటంవలనే. ఇక్కడ చూస్తున్న హోటల్లను చూసినవెంటనే ఒక సారి వెల్దామా అనిపిస్తుంది. కారణం మీరే చూసి తెలుసుకోండి.

Hotel Ještěd, Czech Republic

Giraffe Manor, Kenya

Sarova Saltlick Game Lodge, Kenya

The Marmara Antalya, Turkey

Sun Cruise Hotel, South Korea

King Pacific Lodge, Canada

The Ocean Flower, Maldives

The Ariau Amazon Towers, Brazil

Lake Palace, India

Desert Lotus Hotel, Mongolia

దోమల నివారణ స్మార్ట్ ఫోన్....ఫోటోలు మరియూ వీడియో


LG కంపెనీ వారు LG K7i పెరుతొ దోమల నివారణ స్మార్ట్ ఫోన్ తయారుచేశారు. అల్ట్రా సోనిక్ శబ్ధ తరంగాలను విడుదల చేసి దోమలను తరిమి కొడుతుందట ఈ స్మార్ట్ ఫోన్....ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.
Tuesday, October 3, 2017

విచిత్రమైన సముద్రతీరాలు....వీడియోలు


నల్ల ఇసుక మరియు ఐస్ గడ్డల సముద్రతీరం....ఐస్ లాండ్

వేడి నీటి సముద్రతీరం....న్యూజీ లాండ్

దాగుడుమూతల సముద్రతీరం...చాందిపూర్, ఇండియా

గవ్వల సముద్రతీరం....ఆస్ట్రేలియా

గాజు పెంకుల సముద్రతీరం...కాలిఫోర్నియా, అమెరికా

Monday, October 2, 2017

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: 50 మందికి పైగా అమాయకుల మృతి....ఫోటోలు


అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. లాస్‌వెగాస్‌ స్ట్రిప్‌లో ఆదివారం రాత్రి సంగీత విభావరి జరుగుతుండగా ఓ సాయుధుడు కాల్పులతో తెగబడ్డాడు. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతి చెందగా, 406 మందికి పైగా గాయపడ్డారు. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్‌లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడటంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని సాయుధుడిని కాల్చిచంపినట్టు అధికారులు తెలిపారు.(సాయుధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మరొ సమాచారం).

సంగీత విభావరి లో పాల్గొన్న ప్రజలు(కాల్పులకు ముందు)

కాల్పులు జరిపిన Stephen Craig Paddock వ్యక్తి ఇతనేనట...అతని పక్కన ఉన్నది అతనితో జీవిస్తున్న మహిళ

కాల్పులు జరిపిన వ్యక్తి ఈ హోటల్ 32 వ అంతస్తులో బస చేసి...అక్కడ నుండే కాల్పులు జరిపేడు.

కాల్పుల మోత వినబడిన వెంటనే ఘటనా ప్రదేశం నుండి పరిగెత్తుతున్న జనం.

అమాయకపు ప్రజల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ...ఇప్పుడన్న గన్ కల్చర్ గురించి అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఆలొచించాలని కోరుతున్నాను.