Friday, September 8, 2017

పూలవనంగా మారిన అటకామా ఎడారి...ఫోటోలు


అటకామా ఎడారి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ ఎడారిలో వర్షపాతం దాదాపు శూన్యం. దక్షిణ అమెరికా పశ్చిమాన, పసిఫిక్ మహాసముద్రం తీరంలో యాండీస్ పర్వతశ్రేణికి పశ్చిమాన ఉన్న సన్నని భూబాగంలో ఉన్న ఈ ఎడారి 1000 కి.మీ. (600మైళ్ళు) పొడవున విస్తరించి ఉంది. నాసా, నేషనల్ జియొగ్రాఫిక్, మరికొన్ని ప్రచురణల ప్రకారం అటకామా ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి.

యాండీస్ పర్వతాలు, చిలీ తీర పర్వతాలు కారణంగా ఏర్పడిన వర్షచ్ఛాయా ప్రాంతం మరియు చల్లని భూభాగపు "హంబోల్ట్ కరెంట్ (హుంబొల్ద్త్ ఛుర్రెంత్) కారణంగా ఈ ఎడారి ఏర్పడింది. ఈ ఎడారి వయసు 200 మిలియన్ సంవత్సరాలు. కాలిఫోర్నియాలో ప్రసిద్ధి చెందిన "మృత్యులోయ" (డేథ్ వల్లెయ్) కంటే ఈ ఎడారి 50 రెట్లు ఎక్కువ పొడి అయినది. ఉత్తర చిలీలో విస్తరించి ఉన్నఈ ఎడారి వైశాల్యం 181,300 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఆధిక భాగం ఉప్పు బేసిన్‌లు, ఇసుక మరియు లావా రాళ్ళు.

అలాంటి ఈ ఎడారిలో....ఈ సంవత్సర ప్రారంభంలో అసాధారణ వర్షం పాతం నమోదయ్యింది. అంతే దీనితో ఈ ఎడారి పూలవనంగా మారింది.












No comments:

Post a Comment