Tuesday, September 5, 2017

కీర్తికెక్కిన, ప్రాణముతో ఉన్న చెట్లు.....ఫోటోలు


ప్రపంచవ్యాప్తంగా కీర్తికెక్కిన, ప్రాణముతో ఉన్న చెట్లు ఈ భూమి మీద కొన్ని వందలు ఉంటాయి. అవి ఉన్న ప్రదేశము, వయసు, అసాధారణ రూపం, చారిత్రక సంఘటనలు లేక మనుష్యులచే వింత కార్యాలకు ఉపయోగించటం వలనో కీర్తి పొంది ఉంటాయి. ఈ చెట్లను చూడటానికి ప్రపంపంచం నలుమూలల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ వుంటారు.

Teapot Baobab, Madagascar: టీ కప్పులాగ కనబడే ఈ చెట్టుకు వయసు 1200 సంవత్సరాలట. 1,17,000 లిటర్ల నీళ్లను నిల్వ చేసుకుంటుందట.

Chandelier Tree, USA: 315 అడుగుల ఏత్తు కలిగిన ఈ చెట్టు రంద్రం(ద్వారం) 6 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు ఉంటుంది.

Boab Prison Tree, Australia: 1890 లో స్థానిక నేరస్తులను ఇందులో ఉంచేవారట.

Cotton Tree, Sierra Leone: 1792 లో ఆఫ్రికన్ అమెరికన్ బానిసలు ఈ చెట్టులో దాక్కుని బ్రిటీష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడేరట.

Chêne Chapelle, France: ఈ చెట్టు వయసు 800-1200 సంవత్సరాల మధ్యలో ఉంటుందట. మెట్లపైకి ఎక్కి చెట్టులోపలకు చూస్తే చర్చ్ లాగా ఉంటుందట.

Sunland Baobab, South Africa: 1650 నుండి ఆ చెట్టు అక్కడ ఉన్నదట.

Bartek, Poland: వయసు 700 సంవత్సరాలట. King Jan III ఈ చెట్టు క్రింద న్యాయస్థానం పెట్టేవారట.

Basket Tree, USA

The Great Banyan, India: వయసు సుమారు 250 సంవత్సరాలు ఉంటుందట. 1925 లో పిడుగు పడి ఈ చెట్టు కొంచంగా దెబ్బతిన్నదట. దాని వలన ఈ చెట్టు ఒక కాలనీలాగా తయారయ్యింది. ఈ చెట్టు చుట్టూ 330 మీటర్లకు రోడ్డు వేయబడింది.

Dragon Tree at Icod, Spain: వయసు 1000 సంవత్సరాలట.

1 comment:

  1. balanagamma cinema lo marri torralo mantrikudi praanam , chilakalo vunnadi nijame annamaaata.

    ReplyDelete