Thursday, September 28, 2017

ప్రపంచంలోనే పెద్ద దోమల ఫ్యాక్టరీ....ఫోటోలు


దోమల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా మొదలు రకరకాల వ్యాధులు. వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నివారణకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. ఎన్ని పద్దతులు అవలంబిస్తున్నా దోమల బెడద తప్పటంలేదు. మన దేశంలోనే కాదు. ప్రపంచమంతా ఇదే తంటా.

చైనాలో ఓ సైంటిస్టుల బృందం ఒక వినూత్నమైన ఆలోచనతో దోమలను అంతం చేస్తామంటోంది. ముల్లును ముల్లుతోనే తీయగలమనే నానుడిని ఆసరా చేసుకొని వాళ్ళు దోమను దోమతోనే చంపాలని ప్లాన్ వేశారు.

ఇందుకోసం దోమలను చంపే దోమలను తయారు చేయడానికి ఫ్యాక్టరీ కట్టారట. ఈ ఫ్యాక్టరీలో ప్రతి వారం రెండు కోట్ల దోమల్ని ఉత్పత్తి చేసి బయటకు వదులుతారట. ఈ ఫ్యాక్టరీలో మగ దోమలను మాత్రమే స్టెరిలైజేషన్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు.

మగవి మనల్ని కుట్టవు... వ్యాధులను వ్యాప్తిచెందించవు. ఈ మగదోమల్లో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ స్టెరిలైజ్డ్ దోమలు వ్యాధులను వ్యాప్తి చెందించే దోమలను చంపేస్తాయి, వాటి సంతతిని తగ్గిస్తాయి. దీనితో మనల్ని కుట్టే దోమల బెడద ఉండదు. దీంతో కొన్ని తరాలు గడిస్తే దోమలన్నవి లేకుండా పోతాయి. గత ఏడాది ఓ దీవిలో ఈ కొత్త దోమలను ప్రయోగాత్మకంగా వదిలి చూశారు. కొద్దికాలంలోనే దోమల సంఖ్య సగానికి తగ్గిందట.ఈ ప్రదేశంలోనే దోమలను ప్రయోగాత్మకంగా వదిలి పరిశోధించారు

No comments:

Post a Comment