Saturday, September 2, 2017

అత్యంత ఏకాంత ఇళ్ళు....ఫోటోలు


ఒంటరిగా, ఎవరి ఆలోచనల్లో వారు స్వేచ్ఛగా ఉండటమే ‘ఏకాంతం’ అని విజ్ఞులు చెబుతారు. కేవలం కవులు, కళాకారులకే ఏకాంతం అవసరమని చాలామంది భావిస్తారు. నిజానికి ప్రతి మనిషీ ఏకాంతాన్ని కోరుకునే సందర్భాలు అనేకం ఉంటాయి.

ఏకాంతంగా ఉండటం మనకు కొత్త శక్తిని ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు కలిగించి, నూతనోత్తేజాన్ని నింపుతుంది.

ప్రకృతి అంటే చాలా ఇష్టపడేవారు ఏకాంత జీవితాన్ని ఇష్టపడతారు.

మనిషి సంఘజీవి. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని పెద్దలంటారు. నిత్యజీవితంలో మనిషికి ఎన్నో రకాల సమస్యలు, చీకాకులు, ఒత్తిళ్లు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి అతడు ఏకాంతాన్ని కోరుకుంటాడు. తద్వారా మానసికమైన ప్రశాంతత పొందుతాడు. వ్యక్తిత్వాన్ని ఏకాంతమే పటిష్ఠం చేస్తుంది. మనిషికి మానసిక బలాన్ని అందిస్తుంది. అతడి నుంచి ఒత్తిడిని తరిమేస్తుంది.

జనసమూహంలో ఉన్న మనిషి తన ఆనందాన్ని, దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేడు. అప్పుడు అతడికి ఏకాంతం అవసరమవుతుంది.

మరి ఇక్కడ ఏకాంతంగా ఉన్న ఇళ్ళు ఎందుకు కట్ట్టుకున్నారో?










2 comments:

  1. ఏకాంతంగా ఉండేలా కట్టుకున్న ఇళ్ళు బాగానే ఉన్నాయి గానీ పాలు పోసే మనిషికీ, న్యూస్ పేపర్ వేసే మనిషికీ మహా కష్టం పాపం, హ్హహ్హ 😀😀.

    ReplyDelete
    Replies
    1. అలాంటి ఇళ్ళు బాగా దబ్బుకున్నవాళ్ళే కట్టుకుంటారు గదండీ!
      అలాంటి అత్యవసరపు ఏర్పాట్లు కూడా చేసుకుంటారు లెండి!!

      Delete