Friday, September 8, 2017

ఒక పక్క పెను తుఫానలు(3), మరొ పక్క భూకంపం(సునామీ హెచ్చరిక)పైన సూర్య జ్వాలలు....ఫోటోలు మరియు వీడియోలు.


ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన 'హార్వే' హరికేన్‌ను మరువక ముందే మరో ప్రమాదకర హరికేన్ ..ఇర్మా అట్లాంటిక్ మహాసముద్రం లోని దీవులను, అమెరికా తీరాలను వణికిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కరీబియన్ దీవులను ద్వంశం చేసిన ఇర్మా, ఇంకో 4 రోజులలో అమెరికా తీర నగరాలను తాకనుంది.......ఇప్పుడు ఇర్మాకు తోడుగా మరో రెండు హరికేన్లు పుట్టాయి. ఒకటి "జోస్" మరొకటి "కటి". ఇందులో జోస్ హరికేన్ తీవ్ర రూపం దాల్చే అవవకాశమున్నదని తెలుపుతున్నారు.

ఈలోపు నిన్న మెక్సికో నగరాన్ని భూకంపం తాకింది.భూకంప కేంద్రం మెక్సికోకు చాలా దూరంలో ఏర్పడినా,, అది బలమైన భూకంపం కావడంతో (రిచ్స్టర్ స్కేల్లో 8.2) మెక్సికో నగరాన్ని కుదిపేసింది. ఈ భూకంపం ఎంత తీవ్రమైనదంటే అమెరికా సముద్ర తీరాల నగరాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

ఇక పోతే.. మూడవదిగా నిన్న సూర్య గ్రహంలో రెండు అత్యంత తీవ్రమైన పెళుళ్ళు సంభవించడంతో మంటల జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ జ్వాలల నుండి వెలువడ్డ వేడి తరంగాలు భూమి పై నున్న రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించాయట. రెండో పేలుడు వలన ఏర్పడిన మంటల జ్వాల యొక్క వేడి తరంగాలు ఇంకో రెండు రోజులలో భూమిని తాకనున్నాయని తెలుపుతున్నారు.

పెను తుఫానలు(3)

మెక్సికో భూకంపం

సూర్య జ్వాలలు

No comments:

Post a Comment