Thursday, September 28, 2017

ప్రపంచంలోనే పెద్ద దోమల ఫ్యాక్టరీ....ఫోటోలు


దోమల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా మొదలు రకరకాల వ్యాధులు. వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నివారణకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. ఎన్ని పద్దతులు అవలంబిస్తున్నా దోమల బెడద తప్పటంలేదు. మన దేశంలోనే కాదు. ప్రపంచమంతా ఇదే తంటా.

చైనాలో ఓ సైంటిస్టుల బృందం ఒక వినూత్నమైన ఆలోచనతో దోమలను అంతం చేస్తామంటోంది. ముల్లును ముల్లుతోనే తీయగలమనే నానుడిని ఆసరా చేసుకొని వాళ్ళు దోమను దోమతోనే చంపాలని ప్లాన్ వేశారు.

ఇందుకోసం దోమలను చంపే దోమలను తయారు చేయడానికి ఫ్యాక్టరీ కట్టారట. ఈ ఫ్యాక్టరీలో ప్రతి వారం రెండు కోట్ల దోమల్ని ఉత్పత్తి చేసి బయటకు వదులుతారట. ఈ ఫ్యాక్టరీలో మగ దోమలను మాత్రమే స్టెరిలైజేషన్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు.

మగవి మనల్ని కుట్టవు... వ్యాధులను వ్యాప్తిచెందించవు. ఈ మగదోమల్లో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ స్టెరిలైజ్డ్ దోమలు వ్యాధులను వ్యాప్తి చెందించే దోమలను చంపేస్తాయి, వాటి సంతతిని తగ్గిస్తాయి. దీనితో మనల్ని కుట్టే దోమల బెడద ఉండదు. దీంతో కొన్ని తరాలు గడిస్తే దోమలన్నవి లేకుండా పోతాయి. గత ఏడాది ఓ దీవిలో ఈ కొత్త దోమలను ప్రయోగాత్మకంగా వదిలి చూశారు. కొద్దికాలంలోనే దోమల సంఖ్య సగానికి తగ్గిందట.ఈ ప్రదేశంలోనే దోమలను ప్రయోగాత్మకంగా వదిలి పరిశోధించారు

Tuesday, September 26, 2017

వాతావరణ మార్పు వలన నష్టపడిన వారు....ఫోటోలు


ప్రకృతితో పరిహాసమాడితే ఫలితం ఎట్లా ఉంటుందో అమెరికా మొదలుకొని ఆసియా వరకు అనుభవానికి వచ్చింది. వాతావరణ మార్పు వల్ల ప్రకృతి వైపరీత్యాలు తీవ్రతరమవుతాయని, దీర్ఘకాలికంగా మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని తెలిసినా విధానకర్తలు పట్టించుకోక పోవటం వలన దానివలన ఏర్పడే కష్టాలను ప్రజలు అనుభవించవలసి వస్తున్నది.

అమెరికాలోని టెక్సాస్, లూసియానాలలో హార్వీ బీభత్సం చూసిన తరువాతనైనా వాతావరణ మార్పు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో విధానకర్తలు తెలుసుకోవాలి. వాతావరణ మార్పు వల్లనే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు ఉగ్రరూపంలో విరుచుకుపడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదల, వైపరీత్యాల ఉగ్రత గమనిస్తే మానవాళి మనుగడకు ప్రమాదం తలెత్తుతున్నదనేది బోధపడుతుంది.

కాబట్టి మౌలిక వసతులను వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్మించుకోవటంలో విధానకర్తలు అత్యవసర చర్యలు తీసుకోవాలి.
Monday, September 25, 2017

ప్రేమ లేనిదే జీవించ లేము....వీడియో


సరస్సు లో తేలే రహదారి...ఫోటోలు


ఇటాలీ నగరంలోని అద్భుతమైన Iseo సరస్సులో ప్రజల ఆనందం కోసం తేలే రహదారిని నిర్మించారు. ఈ రహదారి సరస్సుకు చుట్టూ ఉన్న నగర టౌన్లను కలుపుతుంది. ఈ అందమైన సరస్సును చూడటానికి వచ్చే పర్యాటకులు నీటి మధ్యకు వెళ్ళి ఆనందించటానికి, ఒక టౌన్ నుండి మరో టౌనుకు వెళ్ళే అక్కడి ప్రజలకు వీలుగా నీటిపై నడిచి వెళ్ళటానికి ఇది నిర్మించారు.