Wednesday, August 2, 2017

THE EXORCIST......సినిమా గురించిన నిజాలు....ఫోటోలు


1973 లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెట్టింది.....భూతోచ్చాటన అమలులో ఉండేదా? దెయ్యాలూ,భూతాలూ మనుష్యులను ఇలాగే పట్టిపీడిస్తాయా? అని నెవ్వరపోయేరు. ఆ రోజుల్లో అడిగిన ఈ ప్రశ్నలకు సినిమా తీసిన వార్నర్ బ్రదర్స్ అప్పుడు ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. పీటర్ బ్లట్టీ రాసిన నవల ఆధారంగా మాత్రమే సినిమా తీయబడింది అని తెలిపేరు. కానీ సినిమా రిలీజైన 40 వ సంవత్సర వేడుకలో భాగంగా వారు కొన్ని నిజాలను తెలిపేరు.

నిజమైన, జరిగిన సంఘటన ఆధారంగానే పీటర్ బ్లట్టీ ఆ నవల రాసేరు. 1949 లో మిస్సోరి నగరములో 14 సంవత్సరాల బాలుడికి పట్టిన దయ్యమును తరమడానికి మిస్సోరీ నగర చర్చ్ మత గురువులు కొన్ని నెలల పాటూ కష్టపడి ఆ బాలుడిని పట్టిపీడించిన దయ్యమును తరిమేరు. ఆ బాలుని పేరు(నిజమైన పేరు తెలియకూడదని)రోలాండ్ డియో అని తెలిపేరు. మత గురువుల పెద్దగా అప్పటి చర్చ్ ఫాదర్ జేస్యూట్ దయ్యమును తరిమే పనిచేపట్టేరు. నవలను రాసేటప్పుడు పీటర్ బ్లట్టీ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ నవల ప్రసిద్దిచెందిన తరువాత ఆ నవలను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాము. దయ్యము తన పేరును "పజజూ" అని తెలిపింది. కానీ సినిమాలో ఆ పేరును మేము ఉపయోగించలేదు అని వార్నర్ బ్రదర్స్ తెలిపేరు.

కానీ ఆ బాలుడి నిజమైన పేరు రీగన్ మెక్ నైల్ అని, మతమును, మత పద్దతులను ఇష్టపడక ఆ బాలుడు మతవిరుద్ద కార్యాకలాపలలో ఈడుపడ్డాడని, అతనికి మతం గురించి, మతము, దైవ బక్తి గురించి తెలుపాలనే అతనిలో దయ్యం ప్రవేసించిందని మరో కధనం ఉన్నదని తెలిపేరు.

దయ్యం పట్టిందని చెప్పిన బాలుడుని ఈ ఇంట్లో ఉంచే మత గురువులు అతనికి పట్టిన దయ్యమును తరిమేరట.

దయ్యం పట్టినప్పుడు బాలుడు నివసించిన ఇల్లు ఇది.

బాలుడికి దయ్యం పట్టిందని, దానిని మత గురువులు తరిమేరని వాషింగ్టన్ పోస్ట్ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త తరువాతే పీటర్ బ్లట్టీ నవల ప్రసిద్దికెక్కింది.

సైంట్ లూయిస్ లైబ్రరీలో కొన్ని పుస్తకాలలో ఈ బాలుని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. దీని ఆధారంతోనే నవల రాయబడింది. సినిమా తీయబడింది.

మిస్సోరి లోని కావ్లరీ శ్మశానంలో బాలుడిలోని దయ్యమును తరమడానికి సాహసించిన మత గురువు ఫాదర్ విల్లియం బౌడన్ యొక్క మార్బల్ విగ్రహం.

అదే శ్మశానంలో పెద్ద అయిన తరువాత అదే శ్మశానంలో బాలుని శవం పూడ్చిపెట్టిన చోటు.

సినిమాలోని సీన్లు.

No comments:

Post a Comment