Monday, August 28, 2017

రాత్రిపూట వికసించే అందమైన పువ్వులు: అపురూపమైన దేవుని సృష్టి....ఫోటోలు


అనేక జంతువులు, పలు ప్రాణులు పగటిపూట విశ్రాంతి తీసుకుని రాత్రి పూట చురుగ్గా ఉంటాయి. అదే విధంగా కొన్ని మొక్కలు రాత్రి సమయంలో మాత్రమే వాటి పూలను వికసింప జేస్తాయి. అటువంటి మొక్కలను రాత్రి పూలు పూసే మొక్కలని అంటాము.

రాత్రి పూట పూలు వికసించే మొక్కలు మకరందాన్ని పీల్చుకునే రాత్రి నీడలో పెరిగే మొక్కలు. ఇవి రాత్రిపూట ఎందుకు వికసిస్తాయి?...రాత్రిపూట వికసించే ఈ పువ్వులు ఎంతో సువాసన కల్గిఉంటాయి. ఈ సువాసనకు కీటకాలు, శలభాలు ఆకర్షించబడతాయి. ఈ కీటకాలు పువ్వుమీద వాలగానే ఆ పువ్వులోని పరాగరేణువులు కీటకం కాళ్లకు, రెక్కలకు అంటుకుంటాయి. ఈ పరాగరేణువులు మరొక పుష్పానికి ఈ కీటకాలు రవాణా చేసి పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తాయి.

పరపరాగ సంపర్కం జరగకపోతే పుష్పాలు ఫలాలుగా తయారుకావు, రాత్రి సమయంలో ఈ మొక్కల పువ్వులు వికసించి కీటకాలను ఆకర్షించి పరాగసంపర్కం జరిపించి కాయలుగా తయారవుతాయి. ఆ తరువాత పళ్లు అవుతాయి. పువ్వులు పళ్ళుగా తయారయి ఆ తరువాత అవి విత్తనాలుగా ఉపయోగపడతాయి. విత్తనాల వల్ల మళ్లీ మొక్కలు కొత్తవి మొలకెత్తుతాయి.

రాత్రిపూట పూలను విరబూసే పలు మొక్కలు పగటిఉష్ణోగ్రతను తట్టుకోలేవు. పగటి వెలుతురుని భరించలేవు.

Evening Primrose

Night Bloom Water Lily

MoonFlower

Night Gladiolus

Casablanca Lily

Nottingham Catchfly

Four o’ clock

Brahma Kamal

Dragon Fruit

Dutchman’s Pipe Cactus

No comments:

Post a Comment