Monday, August 28, 2017

వీధులకు తెల్ల పెయింట్ వేస్తున్నారు: కారణం?...ఫోటోలు


మన వాతావరణంలో మార్పు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతూంటే కొందరు కాదని తిరస్కరిస్తున్నారు, మరికొందరు దానిని ఎలా ఎదుర్కోవాలో అనే ప్రయత్నాలలో ఉన్నారు. అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ నగర ప్రజలు అలాంటి ప్రయత్నాలలో ఒక ప్రయత్నమును ప్రారంభించారు. అదే వీధులకు పెయింట్ వేయట. పెయింట్ అంటే మామూలు పెయింట్ కాదు. ఉష్ణోగ్రతను తగ్గించగల పెయింట్.

లాస్ ఏంజల్స్ నగరంలో ఎండలు విపరీతంగా పెరిగాయట. ఉష్ణోగ్రత 130-140 డిగ్రీల దాకా ఉండి నగరాన్నే ఉడుకు మండలంగా మారుస్తొందట. తారు ఆధారం కలిగిన కూలింగ్ పెయింట్(పదార్ధము) ను వీధులకు వేస్తున్నారు. ఈ పెయింట్ వీధి వేడిని 11-13 డిగ్రీల దాకా తగ్గిస్తుందట. ఈ తగ్గుదల ఆ వీధులలోని భవనాల వేడిని తిగ్గిస్తుందట. కనీసం నగరంలోని 35 శాతం వీధులను కూలింగ్ పెయింటుతో కప్పితే వాతావరణ వేడి 15 డిగ్రీలు తగ్గుతుందని అంచనా....దీనివలన సంవత్సరానికి 100 మిల్లియన్ డాలర్ల ఎనెర్జీ ఖర్చు తగ్గుతుందట.





No comments:

Post a Comment