Tuesday, August 22, 2017

పరిశుభ్రతకు మారుపేరు ఈ గ్రామం...ఫోటోలు


మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మాలినాంగ్ గ్రామం ఆసియా ఖండంలోనే పరిశుభ్ర గ్రామంగా పేరుతెచ్చుకుంది.

ఒకప్పుడు జనసంచారమే అంతగా కనిపించని కుగ్రామం. రోడ్డు సౌకర్యం కూడా లేని పల్లె. కానీ ఇప్పుడు ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. టూరిస్టులకు ప్రధాన కేంద్రంగా కూడా మారింది.

రోడ్డుకు ఇరుపక్కలా ఏర్పాటు చేసిన వెదురు చెత్త బుట్టలు... పర్యావరణ పరిరక్షణకు నిలువుటద్దాలుగా కనిపిస్తాయి. తరచుగా వాలంటీర్లు రోడ్లను ఊడ్చి చెత్తను ఆ బుట్టలలో వేస్తుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు...ఆ గ్రామ ప్రజలు.

భారత దేశంలోనే దుమ్మూ, ధూళి లేని గ్రామంగా కూడ ఈ పల్లె గుర్తింపు పొందింది.
No comments:

Post a Comment