Monday, August 28, 2017

టెక్సాస్లో భారీ తుపాను భీభత్సం....ఫోటోలు


అమెరికా రాష్ట్రమైన టెక్సాస్ లో భారీ తుపాను భీభత్సం సృష్టించింది.గత పన్నెండు ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ తుపాను వచ్చింది.దీనికి హార్వి అనే పేరు పెట్టారు.ఈ తుపాను కారణంగా టెక్సాస్ రాష్ట్రం అంతా గందరగోళంలో చిక్కుకుందని వార్తలు వస్తున్నాయి. హార్వీ తుఫాను సమయంలో గరిష్టంగా గంటకు 195 కి.మీ వేగంతో గాలలు వీచాయి.ఫలితంగా అనే క ప్రాంతాలలో చెట్లు కూలాయి. కరెంటు స్థంభాలు వంగిపోవడమో,కూలిపోవడమో జరిగింది.తుపాను కారణంగా స్కూళ్లకు,ఆఫీస్ లకు సెలవులు ఇచ్చేశారు. సుమారు రెండున్నర లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.లక్షలాది మంది తుపాను ప్రభావానికి గురి అయ్యారు. వచ్చే వారం రోజులు కూడా భారీ వర్షాలు ( 50 ఇంచ్ ల దాకా) ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.




















No comments:

Post a Comment