Friday, August 11, 2017

రూఫ్ టాప్ తోటలు....ఫోటోలు


కాలుష్యం పెరగడం, చెట్లు నరకడం, అడవులు కుచించుకు పోవడం మొదలైన కారణాల వల్ల భూమి ఉష్ణోగ్రత నానాటికీ పెరిగిపోతోంది.

భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగి పోతోంది. దీనివలనే "గ్లోబల్ వార్మింగ్" లేదా "భూమి వేడెక్కడం" జరుగుతోంది.

దీనికి ముఖ్య కారణం పారిశ్రామిక విప్లవం. దీనివలన యాంత్రిక ఉత్పత్తి పెరిగింది. నగరాలు విస్తరించబడ్డాయి. ఫలితంగా తోటలు, పార్కులు, చెట్లు నరికివేయబడ్డాయి.....పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. పర్యావరణ సమతుల్యతతోనే ప్రజలు బతకగలుగుతారని, చెట్లను పెంచడంతో గ్లోబల్‌ వార్మింగ్‌ను నివారించవచ్చని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు.

చెట్లు పెంచడానికి నగరాలలో ఇప్పుడు భూమి లేదు. అందుకని భవనాలపైన తోటలను పెంచ వచ్చని కొందరు నిరూపించారు. అలా గనుక ప్రతి ఒక్కరూ తమ భవనాలపై తోటలు పెంచితే ఏదో ఒక రోజు గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది.

జపాన్

ఇజ్రేల్

చైనా

సింగపూర్

అమెరికా

ఫొరే ద్వీపం

జపాన్

ఆస్ట్రియా

కెనడా

ఇండియా

No comments:

Post a Comment