Monday, July 24, 2017

ఏలియన్ ల్యాండ్.....ఫోటోలు


“సొకొట్రా”…. హిందూ మహాసముద్రం లోని ఒక వింత దీవి. అందరూ ఈ దీవిని 'ఏలియన్ ల్యాండ్' అని పిలుస్తారు. అంటే గ్రహాంతర నేల అని అర్ధం. ఎందుకంటే ఈ దీవిలో రక్తం కక్కే చెట్లు ఉంటాయి. భూమిపై మరెక్కడా కనిపించని జంతువులు, వాతావరణం...అంతా భలే వింతగా ఏదో వేరే గ్రహం మీద ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ దీవి "యామెన్" దేశ భూభాగం క్రిందకు వస్తుంది.

ఈ దీవిలో 840 రకాల వృక్షజాతులు ఉన్నాయి. అందులో దాదాపు 307 జాతులు భూమిపైన మరెక్కడా కనిపించవు. ఇక వీటిలో మరింత ఆశ్చర్యం కలిగించేది గొడుగు చెట్టు. ఇది పనిగట్టుకుని కత్తిరించిన గొడుగులా ఉంటుంది. దీన్నందరూ 'డ్రాగన్స్ బ్లడ్ ట్రీ' అంటారు. ఎందుకంటే ఈ చెట్టు కొమ్మలను విరిచినప్పుడు అందులో నుంచి రక్తం రంగులో ఉండే ఎర్రని ద్రవం బయటకు వస్తుంది. ఈ ద్రవాన్ని ఎన్నో ఔషదాల్లో వాడుతారట. ఈ దీవిలో ఎక్కువగా కనిపించే మరో చెట్టు 'డెసర్ట్ రోజ్'. దీని క్రింది కాండం ఉబ్బెత్తుగా, ఏనుగు కాలులా తమాషాగా ఉంటుంది.











No comments:

Post a Comment