Tuesday, July 18, 2017

ప్రఖ్యాత ఖగోళ గడియారాలు....ఫోటోలు



ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన విశ్లేషక నమూనాలను కనుక్కోవడము/ అభివృద్ధి చేయడం ప్రాచీన కాలం నుండి జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుసుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం.

టెలిస్కోపులు, కంప్యూటర్లు వచ్చిన తరువాత ఆ పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి, సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము ఇప్పుడు జరుగుతున్నది.

అంతరిక్షంలో సూర్య, చంద్రుల, గ్రహాల స్థానాలను తెలిసుకునేందుకు, వాటి మూలం కాలమానం తెలుసుకునేందుకు ప్రాచీన కాలంలో ఖగోళ గడియారాలను వాడేవారు. వీటిని ఒక ప్రత్యేక శాస్త్రీయ పద్దతిలో, స్పెషల్ యంత్రాలతో రూపొందించేరు. మరి అంతటి విశిష్టమైన ఆ ప్రాచీన ఖగోళ గడియారాలను ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. ఇవి ఇప్పటికీ ఉన్నాయి.

Torrazzo of Cremona clock, Italy

Olomouc astronomical clock,Czech Republic

Astronomical clock in Besancon Cathedral, France

Strasbourg astronomical clock, France

Rostock astronomical clock, Germany

Zytglogge tower clock, switzerland

Prague astronomical clock,Czech Republic

Wells Cathedral clock, England

Jantar Mantar, Jaipur, India

No comments:

Post a Comment