Saturday, July 22, 2017

ఏమిటీ మిస్టరీ?..."భారతదేశ ఆకాశాంలో ఏం జరుగుతోంది?"....ఫోటోలు మరియు వివరాలు


మే నెలలో అమెరికా విడుదల చేసిన declassified సమాచారం శాస్త్రవేత్తలలొ "భారతదేశ ఆకాశాంలో ఏం జరుగుతోంది?" అనే ఈ ప్రశ్నను తిరిగి రేకెత్తింది.

మైసూరు దగ్గరున్న కనగల్(Kanagal)గ్రామంలోని పంట పొలాలలో ఆక్టోబర్-1,2015 మధ్యాహ్నం 2 గంటల సమయములో ఎర్రరంగు కలిగిన ఒక యూఎఫ్ఓ దిగింది(ఊహా చిత్రం).

శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే ఉంటున్నాయి. ఆకాశంలో అరుదుగా కొన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అయితే ఇవి ఏంటి అన్నది అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ గుండ్రని లోతు పళ్లెం ఆకారంలో, మరోసారి ఓ కాంతి సమూహంతో కూడిన దృశ్యం రంగులు, వేగం మారుతూ కనిపిస్తుంది. ఇంకోసారి ఎవరో నడచి వస్తున్నట్టుగా భ్రమ పడతాం. ఇలాంటి దృశ్యాలు చూసినపుడు ఒక్కోసారి వింతగాను, మరోసారి భయంగాను అనిపిస్తుంది. ఇలాంటి ఆకారాలను గుర్తించలేని వాటిని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ), అన్య గ్రహాలు, అన్యులుగా పరిగణిస్తారు.

కాన్ పూర్(Kanpur-UP) లో కనబడిన యు.ఎఫ్.ఓ
భారతదేశ అంతరిక్షం(ఆకాశం)లో యూఎఫ్ఓ క్రియాకలాపం ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రపంచ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిజమే అంటున్నది భారతదేశ ప్రభుత్వం. అయితే తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్నది రహస్యంగానే ఉంచుతారు. కానీ జరిగిన నిజాలను (భారతదేశ అంతరిక్షం(ఆకాశం)లో యూఎఫ్ఓ క్రియాకలాపాలు) దాచలేరు కదా!.....ఆ నిజాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

డిల్లీలో కనబడిన యు.ఎఫ్.ఓ

మరో యు.ఎఫ్.ఓ

మైసూరు దగ్గరున్న కనగల్(Kanagal)గ్రామంలోని పంట పొలాలలో ఆక్టోబర్-1,2015 మధ్యాహ్నం 2 గంటల సమయములో ఎర్రరంగు కలిగిన ఒక యూఎఫ్ఓ దిగింది. అందులో నుండి ఆరెంజ్ రంగు దుస్తులు వేసుకున్న, మానవరూపం కలిగిన ఒక ఆకారం క్రిందకు దిగి పంట పొలంలో పనిచేస్తున్న 7 మందిని ఫోటోలు తీసుకుని వెంటనే యూఎఫ్ఓ ఎక్కి వెళ్ళిపోయింది. యూఎఫ్ఓ పైకి లేచి వెడుతున్నప్పుడు అందులోనుండి ఎటువంటి పొగ, శబ్ధము రాలేదట. ఈ విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పరిశోధకులు 7 గురిని విచారించిన తరువత వారు నిజమే చెబుతున్నట్లు గ్రహించేరు. పరిశోధనా వివరాలను భారతీయ భద్రతాదళం అధికారులకు పంపించేరు.

హిందూ మహాసముద్రంలో పడబోతోందని చెప్పబడిన WTF1190F అంతరిక్ష చెత్త

హిందూ మహాసముద్రంలో ఎక్కడ పడబోతోందో సూచించిన పఠము

హిందుస్తాన్ టైమ్స్ పత్రిక అక్టోబర్-27, 2014 లో ప్రచురించిన ఒక వార్తలో డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే మీద యూఎఫ్ఓ ను చూసేనని విమానాశ్రయ ఏర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారి, తన పై అధికారులకు తెలియజేస్తూ ఆ యూఎఫ్ఓ ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్లో కనిపించలేదని కూడా చెప్పేడు. మరో ఏర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారి రన్వేల మీద 3 యూఎఫ్ఓ లను 11 నిమిషాల వ్యవధిలో చూసేనని, అవేవీ తన రాడర్లో కనిపించలేదని తన పైఅధికారులకు తెలియజేయడంతో వారు విషయాన్ని భారత భద్రతా శాఖకు తెలియజేసేరు.

హిందుస్తాన్ టైమ్స్ పత్రిక అక్టోబర్-27 ప్రచురించిన ఒక వార్తలో

భద్రతా శాఖ వెంటనే తమ అధికార విభాగ ఆఫీసర్లను పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, విషయాన్ని తీవ్ర పరిస్తితిగా గుర్తించి ఒక హెలికాప్టర్ను పంపించి విమానాశ్రయ అంతరిక్షమును గాలించేరు. ఫలితం లేకపోయింది. వెంటనే భారతదేశ భద్రతా శాఖల అధికారులను అత్యవసర సమావేశానికి పిలిచి, విషయాన్ని తీవ్రంగా పరిశీలించి యూఎఫ్ఓ లను షూట్ డౌన్ చేయమని భారత ఏర్ ఫోర్స్ దళానికి ఆర్డర్ అందించింది.

యు.ఎఫ్.ఓ లు కనబడ్డ మరో ఫోటో

2014 లో కాన్ పూర్ లో కనబడిన యు.ఎఫ్.ఓ గురించి అందరికీ బాగా తెలుసు. దీనిని ఒక యువకుడు ఫోటో తీసేడు. 2015- సెప్టంబర్ నెలలో అస్సాంలో కనబడ్డ యు.ఎఫ్.ఓ ను కూడా ఫోటో తీసేరు. ఇది హిమాలయా పర్వతాలలో యు.ఎఫ్.ఓ బేస్ ఉన్నదని చెప్పబడుతున్న చోటుకు దగ్గరలో కనబడింది.

2015…నవంబర్-13న అంతరిక్షం నుండి, అంతరిక్ష చెత్త హిందూ మహాసముద్రంలో పడింది. పడబోతోందని నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందే అంచనా వేసినై. ఈ అంతరిక్ష చెత్తకు WTF1190F అనే పేరు పెట్టేరు. ఈ చెత్త మానవులు చేసిన వస్తువే నని నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఖచ్చితంగా చెబుతున్నాయి. కానీ ఈ వస్తువును ఎవరు తాయారుచేసి ఉంటారో, ఆ వస్తువు అసలు ఏమిటో అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నామని తెలిపేరు. ఆ వస్తువు 7 అడుగుల పొడవు ఉన్నదట. మొదటగా 2012 లో అత్యంతవేగంతో కిందకు దూసుకువస్తున్నట్లు కనబడింది.

ఈ వస్తువు(చెత్త) చంద్రమండలానికి అవతలపక్క నుండి వస్తున్నందువలన, మొదట ఆ వస్తువును అపోలో రాకెట్ కు సంబంధించినదిగా అనుమానించేరు. కానీ తరువాత కాదని చెప్పేరు. భూమి కక్ష్యలో ఎన్నో పాడైపోయిన ఉపగ్రహాలు, ఉపగ్రహాలకు సంబంధించిన వస్తువులు తిరుగుతున్నాయి. వీటిలో భూమి గురుత్వాకర్షణలోకి జారుతున్న వాటిని ముందే పసిగట్టి, అవి భూమిని ఢీ కొనకుండా సముద్రంలో పడటానికి వాటిని మానవులే దారి మళ్ళిస్తున్నారు. కానీ WTF1190F అని పేరు పెట్టబడ్డ ఈ వస్తువు మాత్రం తానుగా కిందకు దూసుకు వచ్చింది. అదే అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ తరువాత ఈ విషయం గురించి గాని, యు.ఎఫ్.ఓ ల గురించి గానీ ఎటువంటి వార్తా లేదు...అదే మిస్టరీ.

No comments:

Post a Comment