Monday, July 3, 2017

మిస్టరీ:.."విజ్ఢానం" విశ్వంలో భద్ర పరచబడి ఉన్నదా?.....వివరాలు మరియు ఫోటోలు


మేధావి లేక విజ్ఞానిగా ఒకరు గుర్తించబడాలి అంటే వారు "విజ్ఢానం" పొంది ఉండాలి. తీవ్ర స్థాయి ప్రతిభ లేక సామర్థ్యం గలవారిని కూడా మేధావులుగా గుర్తిస్తున్నారు. ఉదాహరణకు క్రీడాకారులను తీసుకుందాం. రకరకల క్రీడలలో అత్యున్నతస్థాయిని పొందిన ఎంతోమందిని మేధావులని చెబుతున్నారు.

అసలు మేధావి అంటే ఏమిటి? మనం మేధావి అవలేమా?

విశ్వంలో భద్ర పరచబడ్డ "విజ్ఢానం"(“ఆకాశ గ్రంథము” ....ఊహా చిత్రం)

"మెదడును రీ-వైరింగ్ చేస్తే ఎవరైనా మేధావులవగలరు" అని సైన్స్ నమ్ముతోంది. కానీ అదే సైన్స్ మెదడును రీ-వైరింగ్ ఎలాచేయాలో నన్న పరిశోధనలలో మునిగిపోయింది గానీ "ఇలా రీ-వైరింగ్" చేస్తే ఎవరైనా మేధావి అవగలరని చెప్పలేకపోతోంది.

మేధావులుగా గుర్తించబడి, చనిపోయినవారి మెదడులను పరిశోధనలు చేస్తున్నారు. కానీ దీని మూలంగా ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. అయితే తలకి గాయం తగిలిన కొందరు, కోమాలలోకి వెళ్ళి తిరిగి వచ్చిన కొందరు తమ ప్రవర్తనలలో అంతకు ముందుకంటే మేధావితనం చూపించి ఆశ్చర్య పరచటం చూసి, వారి మెదడులలో ఎలాంటి మార్పు చోటుచేసుకుందో వారి మెదడులను పరీక్షచేసి కొన్ని విషయాలు తెలుసుకుంది. అదే మెదడు “రీ-వైరింగ్”.

తలకు గాయం తగిలినప్పుడు, కోమాలలోకి వెళ్ళటానికి ముందు తీసిన ఎక్సరేలతో..... వారు చికిత్స పొంది మేధావితనం పొందినప్పుడు తీసిన ఎక్సరేలను పోల్చి చూసినప్పుడు వీరి మెదడులో నరాల పోలిక వేరుగా ఉండటంతో వారి మెదడు రీ-వైరింగ్ అయ్యిందని తెలుసుకున్నారు. కానీ వారి మెదడులో నరాలు ఎలా రీ-వైరింగ్ అయ్యిందో తెలుసుకోలేకపోతున్నారు.

ఇతర అవకాశాల గురించి ఆలొచిస్తే మెదడు తార్కిక కార్యకలాపాలను తనకుతాను సర్దుబాటు చేసుకుని కొత్త మార్గాలతో తాజా పద్ధతులతో ఆలోచించడం మొదలుపెడుతోంది. దీనినే మారుపడ్డ స్మారక స్థితి, లేక ట్రాన్స్, లేక కలలు అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మెదడు “రీ-వైరింగ్(ఊహాచిత్రం)

కొంతమంది విద్యావేత్తలు విజ్ఢానం “ఆకాశ గ్రంథము” అనే సిద్ధాంతంపై మొగ్గుచూపుతున్నారు. "ఆకాశ గ్రంధాలు" అనే సిద్ధాంతంపై విద్యావేత్తలలో వేరు వేరు అభిప్రాయాలున్నాయి. కానీ చాలామంది విద్యావేత్తలు “"ఆకాశ గ్రంధాలు" అంతర్జాతీయ విజ్ఢాన డేటాబేస్. ఎవరైనా, ఎప్పుడైనా, ఏ కారణం కోసమైనా ఆ ఆకాశ గ్రంధాలలోనుండి సమాచారం వెలికి తీసుకోవచ్చు. కానీ ఈ ఆకాశ గ్రంధాలయంలోకి ప్రవేశించాలనుకునేవారు పరధ్యానానికి తావివ్వకుండా తమ మెదడుని అతిగొప్ప స్మారక స్థితిలో ఉంచుకుని(అలా ఉంచుకుంటే మెదడు రీ-వైరింగ్ అవుతుందని) అప్పుడు ఏదైతే కావాలని కోరుకుని వెడతారో దానికి తగిన విజ్ఢానమును ఆకాశ గ్రంధాల డేటాబేస్ నుండి ఉచితంగా పొందవచ్చును. మానవులే కాకుండ ఇతర ఏ ప్రాణి అయినా కూడా ఉచితంగా విజ్ఢానమును పొందవచ్చు ను” అని చెబుతున్నారు………..దీనినే ESP(Extra Sensory Power) అంటారా?.....సైన్స్ ESP అనేది ఉన్నదని చెబుతున్నదిగానీ ఆకాశ గ్రంధాలయం ఉన్నదని అంగీకరించటం లేదు.

Alpha Waves

చరిత్రలో గుర్తించదగిన పేర్లు కలిగిన కొంతమంది మేధావులు ఆకాశ గ్రంధాల నుండి విజ్ఢానం పొందినవారే. వీరిలో కొంతమంది ఒక్కపూటలో మేధావులైనవారున్నారు.

ఉదాహరణకు కొంతమంది మేధావుల గురించి తెలుసుకుందాం.

మనదేశంలో పుట్టి,పెరిగిన గణితశాస్త్ర ప్రవీణుడు, మేధావి శ్రీనివాస రామానుజం. 1887 లో పుట్టిన ఈయనకు గణితశాస్త్రంలో పధ్ధతిప్రకారం శిక్షణ లేదుకదా, కనీసం లెక్కలలో కనీస జ్ఞానం కూడా లేదట. కానీ ఈయనకు కలలో నామగిరి అమ్మవారు కనబడి ఒక లెక్కల సూత్రము చెప్పిందట. కలలో నుండి బయటపడ్డ శ్రీనివాస రామానుజం ఆ లెక్కల సూత్రమును రాసిపెట్టుకునేవాడట. అప్పటి నుండి ఆయనకు లెక్కల మీద శ్రద్ద ఏర్పడిందట. రాసుకున్న లేక్కల సూత్రాలను ఆయన లెక్కల సంప్రదింపుల సమావేశంలో అందించేవాడట. నామగిరి అమ్మవారు శ్రీనివాస రామానుజం కలలో అనేక సార్లు కనబడి గణితశాస్త్ర సూత్రాలు అందించేదట. వీటన్నింటినీ శ్రద్దతో చదివి లెక్కల సదస్సులలో వినిపించేవాడట.సదస్సులలో తనకు కలలో నామగిరి అమ్మవారు కనబడి ఈ లెక్కల ఫార్ములాలు ఇచ్చిందని చెప్పేవారట.

శ్రీనివాస రామానుజం తల్లికి కలలో నామగిరి అమ్మవారు కనబడి కొడుకున ఇంగ్లాండ్లో జరగబోతున్న అంతర్జాతీయ లెక్కల సదస్సుకు పంపమన్నదట. శ్రీనివాస రామానుజం ఇంగ్లాండులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో లెక్కల సూత్రాలను వివరించేడట.

శ్రీనివాస రామానుజం అందించిన లెక్కల ఫార్ములాలన్నీ సరైనవేనని సదస్సులలొ తెలేవట. అందులో కొన్ని ఖచ్చితమైనవిగా అంగీకరించబడ్డాయి. ఆయన గణితములో అందించిన ఫార్ములాలు గణితశాస్త్ర పరిశొధనలకు ప్రేరేపిత ఫార్ములాలుగా తీసుకొనబడి గణితశాస్త్ర చరిత్రకు ఎంతగానో ఉపయొగపడినందువలన ఆయన పేరుని ఒక పత్రికకు పెట్టేరు.

ఆకాశగ్రంధాలను అందుకోగలిగిన మరొక వ్యక్తి రష్యాదేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త Dmitri Mendeleev. పీరియాడిక్ టేబుల్(Periodic Table)ను కనుగొన్న శాస్త్రవేతగా పేరుపొందిన ఈ మేధావి కూడా "కలలో నాకు ఈ టేబుల్ కనబడ్డది. కల నుండి బయటకు వచ్చిన వెంటనే కలలో కనబడ్డ టేబుల్ ను కాగితం మీద రాసేను" అని తెలిపేరు.


Theory of Relativity మరియు Benzene Moleculeని కూడా ఇలాగే కనుగొన్నారని చెబుతారు.

ఈ మధ్య వెలువడ్డ I-pad మరియు I-phone పరికరాలను మనకు అందించిన స్టీవ్ జాబ్స్ కూడా ఈ పరికరాలను కలలో చూసే డిజైన్ చేసేను అని తెలిపేరు.

Alexander Graham Bell టెలిఫోన్ను కనుగొన్నారని చెబుతారు. కానీ ఆయన టెలిఫోన్ పేటెంట్ ను రిజిస్టర్ చేసిన రోజే, Elijah Grey కూడా టెలిఫోన్ పేటెంట్ రిజిస్టర్ చేసేరు. కానీ Elijah Greyను నిర్లక్ష్యం చేసేరు. అయితే ఈ రోజు మనం ఫోన్లలో వాడుతున్న టెక్నాలజీ Elijah Grey ఫార్ములా చేసిందే. ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు, ఒకే సమయాన ఎలా టెలిఫోన్ ఫార్ములాలను రిజిస్టర్ చేయగలరు?....ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ అర్ధం కావటంలేదు. రైట్ సోదరులు మరియు Samuel Langley పెద్ద విమానాలను కనుగొనే విషయంలో పోటీ పడ్డారు. మానవజాతి యొక్క పరిణామం అభివృద్ధి చెందిన విధానాన్ని Charles Darwin మరియు Alfred Wallace ఇరువురూ ఒకే లాగా చెప్పగలిగేరు.....ఇవి ఎలా సాధ్యమయ్యేయి?

Alpha Waves(ఊహాచిత్రం)

మెదడు ఎలా పనిచేస్తోంది అనేది పూర్తిగా అర్ధం చేసుకొవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టేరు. అపస్మారక స్థితిలో ఉండే మెదడులో నుండి కొన్ని తరంగాలు వెలువడుతున్నాయని తెలుసుకున్నారు. ఈ తరంగాలకు Alpha Waves అని పేరు పెట్టేరు. ఈ తరంగాలే మానవులను మేధావులుగా చేస్తున్నాయని తెలుసుకోగలిగేరు. అయితే ఈ Alpha Waves తరంగాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పలేకపోతున్నారు.

కొంతమంది శాస్త్రవేత్తలు "Alpha Waves తరంగాలు కృత్రిమముగానూ, ఉద్దేశ్యంతోనే మానవజాతికి పంపబడుతోంది.....అదికూడా ఎంచుకోన్నవారికి మాత్రమే పంపబడుతోంది. సరైన సమయంలో సరైన స్థానంలో సరైన వ్యక్తికి మాత్రమే "విజ్ఢానం" అందించబడుతూ మానవజాతిని ముందుకు తీసుకువెళ్ళటానికీ, అదుపుచేయటానికే జరుగుతోంది" అని వాదిస్తున్నారు.

ఈ Alpha Waves తరంగాల గురించి సైన్స్ పూర్తిగా వివరించేతవరకు ఇదొక అతిపెద్ద మిస్టరీగానే ఉంటుంది.

No comments:

Post a Comment