Tuesday, July 25, 2017

మిస్టరీ: ...భూమి మీద రెండవ జాతి!....ఫోటోలు మరియు వివరాలు


“భూమిమీదున్న రెండవ జాతి డబ్బును, మతాలను నియంత్రిస్తోంది”

భూమి మీద మానవజాతి కాకుండా మరో జాతి కూడా సంచరిస్తోందా? ఆ రెండవ జాతే ప్రపంచములోని అన్ని మతాలను మరియు డబ్బును నియంత్రణ చేస్తోందా? ఆ జాతివారే మానవులను శాసిస్తున్నారా, వారు చెప్పినట్లే మానవులు నడుచుకుంటున్నారా? వారు మానవులతో కలిసి జీవిస్తున్నారా? మనలో ఒకళ్ళుగా సంచరిస్తున్నారా?.......ఇలా తలచుకుంటేనే వొళ్ళు జలదిరిస్తోంది......అవునా?

కానీ ఒక ప్రముఖ వ్యక్తి ఈ విషయాన్ని చెబితే అది నమ్మాలా? వద్దా?

మనకులాగానే ప్రపంచములోని చాలామంది ప్రజలు ఆ ప్రముఖ వ్యక్తి చెప్పేది నమ్మాలా, వద్దా అనే గందరగోళంలో ఉన్నారు. చాలామంది ఆ ప్రముఖ వ్యక్తి చెప్పింది కొట్టిపారేసేరు. కొంతమంది మాత్రం ఆ వ్యక్తి చెప్పిందాంట్లో నిజాలను వెదుకుతున్నారు ……ఎవరా వ్యక్తి?

ఆ వ్యక్తి మామూలు వ్యక్తి అయితే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. ఆ వ్యక్తి ప్రపంచ బ్యాంక్(World Bank)మాజీ సీనియర్ (పై స్థాయిలో పనిచేసిన)మహిళా అధికారి Karen Hudes. ఉన్నత స్థాయిలో పనిచేసిన (World Bank) వ్యక్తి కాబట్టి ఆమె చెప్పింది నమ్మాలని అవసరంలేదు. కానీ ఆమె చెప్పింది ప్రాచీన చారిత్రక నిజాలకు దగ్గరగానూ, ఆధునిక(ఈమద్య) కాలంలో బహిర్గతం అవుతున్న విచిత్ర (రహస్య సమూహాలు ఉన్నాయనడం, యూ.ఎఫ్.ఓ లు భూమికి వచ్చి వెడుతున్నాయండం) సంఘటనలు ఆమె చెప్పిన విషయాన్ని బలపరుస్తున్నాయి. ఈమెలాగానే కెనడా దేశ మాజీ జాతీయ రక్షణ మంత్రి Paul Hellyer కూడా " 4 రకాల అన్య జాతుల వారు 1000 సంవత్సరాల నుండి భూమికి వచ్చి వెడుతున్నారు" అని తెలిపేరు.

ప్రపంచ బ్యాంక్(World Bank)మాజీ సీనియర్ (పై స్థాయిలో పనిచేసిన)మహిళా అధికారి Karen Hudes.

Karen Hudes టీవీ కి ఇస్తున్న ఇంటర్ వ్యూ

"పదవిలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తెలిపి ఉండొచ్చు కదా.....ఇప్పుడు చెప్పవలసిన అవసరమేముంది" అని చాలామందిలో అనుమానం తలెత్తవచ్చు. పదవిలో ఉన్నప్పుడు చెబితే అది అధికారపూర్వకమైన ప్రకటన అయిపోతుంది. పదవి చేపుచ్చుకుంటున్నప్పుడు ‘అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రభుత్వ రహస్యాలను కాపడతాము అని ప్రమాణస్వీకారం తీసుకుంటారు’. పదవిలోకి వచ్చే ముందు ప్రభుత్వ రహస్యాలు తెలియవు. పదవిలో కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వ రహస్యాలు తెలుస్తాయి. బాధ్యతతో పనిచేసే అధికారులు ప్రజలకు అన్యాయం జరుగుతున్న వాటిని గుర్తించి, వాటిని ఆపమని లేక ప్రజలకు తెలియపరచమని ప్రభుత్వాలకు చెబుతారు. ప్రభుత్వాలు బలంగా ఉంటాయి కాని ప్రత్యేక వ్యక్తికి బలం ఎక్కడ నుండి వస్తుంది. అందువలన ప్రభుత్వాలను నిలదీయలేక, ఎదురించలేక తమ పదవిని కొనసాగిస్తూ, పదవి విరమణ చేసిన తరువాత మనసాక్షికి భయపడుతూ ఏదో ఒక రోజు, ఏదో ఒక విధంగా విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. విజిల్బ్లోయర్ గా మారతారు" Karen Hudes చెప్పిన విషయాన్ని సమర్ధించే కొంతమంది ఇలా వాదిస్తున్నారు.

అమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో "మన గ్రహం మీద అన్యప్రాణులు (extraterrestrials) ఉన్నాయనే ఆలోచనను తిరస్కరిస్తున్నాను. ఖచ్చితంగా ఆ ఆలొచనను ఒప్పుకొను. కానీ మనం(మానవజాతి)ఒంటరిగా మాత్రం లేము. భూమిని రెండవజాతివారు పర్యటిస్తున్నరనే సూచనకు కావలసినంత ఆధారమున్నది".

“దేశాలన్నీ ఒకటిగాలేవు. అవినీతిని పోరాడుతున్న విభాగమూ ఉన్నది, ఎన్నుకొనబడిన సభ్యులూ ఉన్నారు. ఎన్నుకొనబడిన సభ్యులు ఆ ఆ దేశాలలో ప్రజలకు దేశద్రోహులుగా ఉంటున్నారు. వీరి వెనుక వీరిని నియంత్రణ పరచటానికి మత సంఘానికి చెందిన నెట్వర్క్ ఉన్నది. వీరిని నియంత్రణ పరచటానికి సమూహాలున్నాయి. అందులో ఒక సమూహం Hominids. వీరు మనుష్యులు కారు. వీరు మంచు యుగంలో అత్యధిక శక్తిమంతులుగా ఉండేవారు. పొడిగించిన పుర్రెలు కలిగి, విపరీతమైన మేధావితనం గలవారు. ఇంతకంటే నేను వివరించలేను. మనమంతా రహస్య సమూహాలతో మరియు రహస్యాలతో నిండిన ప్రపంచములో జీవిస్తున్నాము. ప్రజలకు తెలియవలసిన సమాచారం, తెలియనివ్వటంలేదు" అని చెప్పింది.

ప్రపంచ బ్యాంకు లొ జరిగిన ఏన్నో అవినీతి పనులను బయటపెట్టిన ఈమె, విశ్వసించదగిన World Bank Whistleblower గా ప్రసిద్ది చెందింది. ప్రస్తుత ప్రపంచం ‘ద్రవ్యం(డబ్బు)యుద్దంలో’ఉన్నది అని చెప్పింది. 1999 లో ఫిలిపైన్స్ దేశంలోని రెండవ అతి పెద్ద బ్యాంకును కొందరు అవినీతికొసం కైవసం చేసుకున్నారని బయటపెట్టింది. పలు దేశ ప్రభుత్వాలు ఆర్థిక సంబంధమైన సంస్థల తో కలిసి కలిసికట్టుగా అవినీతి పనులు చేస్తున్నాయనే విషయాన్ని కూడా బయటపెట్టింది ఈమే.

కెనడా దేశ మాజీ జాతీయ రక్షణ మంత్రి Paul Hellyer టీవీ కి ఇస్తున్న ఇంటర్ వ్యూలు


కెనడా దేశ మాజీ జాతీయ రక్షణ మంత్రి Paul Hellyer కూడా " 4 రకాల అన్య జాతుల వారు 1000 సంవత్సరాల నుండి భూమికి వచ్చి వెడుతున్నారు" అని తెలిపేరు. “అందులో నాకు ఓకరి గురించే తెలుసు. వారు Anderomeda నక్షత్రమండలాలలో ఉన్న గ్రహం నుండి వచ్చేరు. వారు క్రమశిక్షణకు కట్టుబడ్డవారు. మన గ్రహాన్ని మనమే యుద్దాలపేరుతో నాశనం చేసుకుంటున్నామట. అనవసరమైన పరిశోధనలతో డబ్బు వ్రుధా చేసుకోవడమే కాకుండా, ఇతర గ్రహాలపై దాడిచేయాలని ప్రయత్నంచేస్తున్నామట. అది వారికి నచ్చలేదట. వెంటనే ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్ళేరు” అని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపేరు. వీరే కాకుండా మరింకెంతోమంది మాజీ సైనిక అధికారులు వీరు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదని, తమ దగ్గర కూడా కావలసిన అధికార పత్రాలు ఉన్నాయని వీరు చెప్పిన విషయాన్ని అమొదిస్తున్నారు.

Anderomeda నక్షత్రమండలాలలో ఉన్న గ్రహం

ఇవన్నీ ఎంతవరకు నిజం, మనతో కలిసి, మనలో ఒకరిగా తిరుగుతున్న ఆ రెండవ జాతి వారు ఎవరు?.....వీరు ఏ విధంగా మన మీద అధికారం చెలాయిస్తున్నారు?.....మానవులలో ఎవరు వీరికి సహాయపడుతున్నారు....వీటికి సమాధానం ప్రభుత్వాలే చెప్పాలి.....చెబుతాయా? ఈ ప్రశ్నే మిస్టరీ!

No comments:

Post a Comment