Monday, July 31, 2017

ప్రపంచ అర్ధీక వ్యవస్తను ప్రభావితంచేయు కొన్ని సంస్థలు....ఫోటోలు


సంవత్సర ఆదాయం:

1. Walmart....485 బిల్లియన్ డాలర్లు

2. State Grid Corporation of China....329 బిల్లియన్ డాలర్లు

China National Petroleum Corporation...299 బిల్లియన్ డాలర్లు

China Petrochemical Corporation....294 బిల్లియన్ డాలర్లు

5. Royal Dutch Shell...272 బిల్లియన్ డాలర్లు

6. ExxonMobil...246 బిల్లియన్ డాలర్లు

7. Volkswagen Group...236 బిల్లియన్ డాలర్లు
8.Toyota...236 బిల్లియన్ డాలర్లు

9. Apple Inc...233 బిల్లియన్ డాలర్లు

10. BP...225 బిల్లియన్ డాలర్లు

త్వరలోనే అందుబాటులోకి రాబోయే భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం.....ఫోటోలు


క్యాన్సర్ వ్యాధికి మేలైన చికిత్స....అంటే: క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా గుణం చేయగల మందులు త్వరలోనే వెలుగు చూస్తాయి. దీనితో ఈ వ్యాధి మీదున్న ఇప్పటి భయం దూరమవుతుంది.

మానవ మెదడులాగా విశ్లేషణ శక్తితో పనిచేసే కంప్యూటర్ ప్రాససర్.

ఒకేఓక మందు గుళికతో స్థూలకాయం తగ్గుదల.

ప్రపంచంలోని ఏ చోటుకైనా నాలుగు గంటలలో తీసుకు వెళ్ళగల విమానం.

పల్చని సెల్ ఫోన్.

రోగలక్షణములను తెలియజేయు స్మార్ట్ ఫోన్.

కృత్రిమ చర్మము.

చంద్ర మండలంలో మానవ గ్రామము.

పరిశోధనాలయాలలో మానవ అవయవాల ఉత్పత్తి.

పూర్తిగా సౌర విద్యుత్

కుక్కపిల్లను దత్తతు తీసుకున్న కోతి....ఫోటోలు


విచ్చలవిడి జంతువుల దగ్గర నుండి రక్షించడానికి ఒక కోతి అనధగా వదిలివేయబడ్డ ఒక కుక్క పిల్లను దత్తతు తీసుకుంది. ఇది అలహాబాద్ ప్రజలను ఆశ్చర్యపరచింది. ఆశ్చర్యపోయిన ఆ ఊరి జనం, ఆ కోతి కుక్కపిల్లకు చేస్తున్న సహాయానికి ముచ్చటపడి వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు.

అసాధారణ జంతువుల స్నేహాన్ని మనం అక్కడక్కడ చూసే ఉంటాం. కానీ ఇక్కడ కోతి కుక్కపిల్లకు చేస్తున్నది స్నేహ భావంతో కాదు....మాత్రు భాంవతో. ఎవరూ లేని అనాధను దగ్గరకు తీసుకున్నట్లు.

ఎవరైనా ఆహారం ఇస్తే మొదట కుక్కపిల్ల కడుపు నింపి, మిగిలినది తాను తింటోంది. విచ్చలవిడి జంతువుల దగ్గర నుండి కుక్కపిల్లకు రక్షణ ఇస్తున్న ఈ కోతి...కుక్కపిల్ల మధ్య బాంధవ్యాన్ని ఏర్పరచింది ఎవరో!

దత్తతు తీసుకున్న కుక్క పీల్లతో

విచ్చలవిడి జంతువుల దగ్గర నుండి కుక్క పిల్లను రక్షిస్తున్న కోతి

కుక్కపిల్లకు మొదటగా ఆహారం తినిపిస్తున్న కోతి

రక్షణగా కుక్క పిల్లను తనతోనే తీసుకువెడుతున్న కోతి

మాత్రు భాంవతో

కుక్కపిల్లను ఆటలాడిపిస్తున్న కోతి

పండ్లు తినిపిస్తున్న కోతి

కోతి, కుక్కపిల్లకు చేస్తున్న సహాయానికి ముచ్చటపడి వాటికి ఆహారాన్ని అందిస్తున్న అలహాబాద్ ప్రజలు

Friday, July 28, 2017

గో తెలుగు.కాం లో నా కథ "నిజాయతీ పెళ్ళాం".....లింక్


నా కథ "నిజాయతీ పెళ్ళాం" గో తెలుగు.కాం అంతర్జాల వార పత్రిక 28/07/2017 సంచికలో ప్రచురితమయ్యింది. చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

లింక్: http://www.gotelugu.com/issue225/5686/telugu-stories/nijayitee-pellam/

అద్భుతమైన వీక్షణా వేదికలు....ఫోటోలు


ప్రశా౦తమైన, మనోహరమైన ప్రకృతి దృశ్యాలు, వాటి మధ్యగా నడిచి వెళ్లడ౦, పర్వతాలు ఎక్కడ౦, రివ్వున స్కీయి౦గ్ చేస్తూ ఆన౦ది౦చడ౦ లా౦టి అవకాశాలు గల పర్వత ప్రా౦తాలు సెలవులు గడపడానికి వెళ్లే చాలామ౦దిని ఆకర్షిస్తాయి. లక్షలాదిమ౦ది మేఘాలక౦టే ఎత్తుగావున్న ప్రా౦తాలకు వెళ్ళి అక్కడి నుండి ప్రకృతి అందాలను తిలకించడానికి ఆశపడతారు. ఎందుకంటే అతి ఎత్తైన ప్రదేశానికో, స్థలానికో, భవనానికో వెళ్లి అక్కడి నుండి క్రింద కనబడే ప్రక్రుతి అందాలను తిలకించడం ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడానికే అసాధ్యమైన కొండలు, దగ్గరకు వెళ్లడానికే భయపడే జలపాతాలూ,కంటికందని చూపువరకు లోతుగా ఉండే లోయలూ ఇలా ఎన్నో కనులకు విందైన అందాలను ప్రకృతి మనకు అందించింది. వీటి అందాలను చూడాలనుకున్నా అక్కడికి వెళ్లలేము. కానీ కొన్ని దేశాలలో ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి వీలుగా ఎత్తైన ప్రదేశాలలో వీక్షణా వేదికలు ఏర్పరిచేరు. అలాంటి వీక్షణా వేదికలలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

AlpspiX Viewing Platform, Germany...2,628 మీటర్ల ఎత్తులో

Mirante em Shilinxia,China...1600 మీటర్ల ఎత్తులో

Five Fingers Platform, Austria....1400 మీటర్ల ఎత్తులో

Grand Canyon’s Skywalk, United States...1,219 మీటర్ల ఎత్తులో

Langkawi-Sky-Bridge Malaysia...700 మీటర్ల ఎత్తులో

Top of Tyrol, Austria....3200 మీటర్ల ఎత్తులో

Matteo Thun's...Italy...900 మీటర్ల ఎత్తులో

British Airways, i360 tower, England....162-మీటర్ల ఎత్తులో

Dachstein Glacier Skywalk...Austria 700 మీటర్ల ఎత్తులో

Iguazu Viewing platform....Brazil....1010 మీటర్ల ఎత్తులో

అన్యగ్రహానికి చెందిన కీటకాలా?.....ఫోటోలు


అన్యగ్రహానికి చెందిన కీటకాలా?....కాదు. భూమండలంపైన ఉన్నవే. ప్రకృతి మనల్ని ఎప్పుడూ విస్మయ పరుస్తూనే ఉంటుంది అనడానికి ఈ ప్రాణులే ఉదాహరణ.

Puss Moth Caterpillar

Devil’s Flower Mantis...Idolomantis Diabolica

Brazilian Treehopper

Dasychira Pudibunda Caterpillar

Extatosoma Tiaratum

Pipevine Swallowtail Caterpillar

Atlas Moth

Tailed Emperor Butterfly Caterpillar

Spiny Flower Mantis...Pseudocreobotra wahlbergi

Scorpionfly