Tuesday, June 6, 2017

మిస్టరీ:..చదరంగం(ఆట)ను కనుగొన్నది అన్యులా?....ఫోటోలు మరియు వివరాలు

ఈ రోజుకూ ప్రపంచవ్యాప్తంగా దీని మీద అతిపెద్ద చర్చ జరుగుతున్నది.

అంతర్జాతీయ చదరంగ ఆట సమాఖ్య FIDE(Fédération Internationale des Échecs లేక World Chess Federation) ప్రస్థుత ప్రెశిడెంట్ Kirsan Ilyumzhinov.

ఊహా చిత్రం
"చదరంగ ఆటను కనుగొన్నది అన్యులు. ఈ మాటను వారే నాకు చెప్పేరు. నా ఇంటి నుండి సెప్టంబర్-18, 1997 న అన్యులు నన్ను వారి నౌకలో అపహరించుకుపోయి ఒక గ్రహంపై ఉంచి టెలిపతీ మూలం (ప్రాణ వాయువు తక్కువగా ఉండటం వలన) ఈ విషయం నాకు చెప్పేరు" అని 2007లో Al Jazeera న్యూస్ చేనల్ కు ఆయన (ప్రస్థుత ప్రెశిడెంట్) ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలీజేయడమే చర్చకు ముఖ్య కారణం.

Kirsan Ilyumzhinov.

చదరంగ ఆట యొక్క ప్రారంభం గురించి వివిధ దేశాలు మధ్య వివాదాలు ఉన్నాయి. కాని ఈ ఆట భారత్ లోనే పుట్టిందని చాలామంది భావిస్తున్నారు. చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారత దేశంలోనే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర చెబుతోంది. చదరంగాన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుండి పెర్షియా కి వ్యాప్తించింది. పెర్షియా మీద దాడి చేసిన అరబ్స్ దక్షిణ యూరోప్ కి ఈ ఆటని తీసుకెళ్ళారు.

చదరంగం ఆడడం బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును. భారత దేశపు మూలమైన పురాతన ఆటల నుంచి పుట్టి దక్షిణ ఐరోపా ఖండంలో, పదిహేనవ శతాబ్దపు రెండవ భాగంలో పెరిగిన ఈ ఆట ప్రస్తుత దశకు చేరుకుంది. ఈ రోజున, చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించింది. క్రమబద్దమైన చదరంగం ఆటల పోటీల సంప్రదాయం 16 వ శతాబ్దంలో ప్రారంభించారు.

మొదటి అధికారిక ప్రపంచ చదరంగ ఛాంపియన్ టైటిల్ ను, విల్ హెల్మ్ స్టీనిజ్ 1886 లో గెలుచుకున్నాడు. చదరంగం ఒలింపియాడ్స్ ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. 20 వ శతాబ్ద ప్రారంభమునుండి, వరల్డ్ ఛెస్ ఫెడరేషన్, అంతర్జాతీయ చదరంగం ఆటల పోటీలను నిర్వహిస్తోంది.

“అన్యులు చెప్పింది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పురాతన కాలం నుండి ఆడుతున్న ఈ ఆటకు ప్రపంచవ్యాప్తంగా నియమాలు ఒకటి గానే ఉండడం ఒకటైతే, చదరంగ పలక అరవైనాలుగు గళ్ళు కలిగి ఉండటం, మన మానవ కణం(Human Cell)కూడా అరవైనాలుగు ముక్కలతో తయారై ఉండటం రెండవది” ఆయన తెలిపేరు

(Kirsan Ilyumzhinov పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్య వివరాలు)

“ నన్ను అన్యులు అపహరించుకు పోయేరనాడినికి సాక్ష్యులు నా కారు డ్రైవర్, నా పర్శనల్ అసిస్టెంట్, నా సహాయక మంత్రి” అని కూడా తెలిపేరు. 1993 నుండి 2010 వరకు రష్యా రాష్ట్రమైన Russian Republic of Kalmykia కు ఈయన ప్రధాన మంత్రిగా ఉండేవారు.

(పత్రికలలో Kirsan Ilyumzhinov ఇచ్చిన పూర్తి వివరాలు)

25 సంవత్సరాలుగా ఈయన World Chess Federation కు అధిపతిగా ఉంటున్నారు. ఈయన ఆధిపత్యంలో చదరంగం ఆటను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేరు. అంతర్జాతీయ చదరంగ పోటీలు నిర్వహించేందుకు శాశ్వతమైన ఒక నగరాన్నే నియమించేడు.

అన్యులు తనని అపహరిచుకుపోయేరని Kirsan Ilyumzhinov 2001లో రష్యాలోని రేడియో ఫ్రీడం అనే రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మొదటిసారిగా తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్యుల గురించి మాట్లాడిన మొదటి రాజకీయ నాయకుడు కూడా ఇతనే. రాజకీయ నాయకుడిగా ఉంటూ ధైర్యంగా అన్యుల గురించి మాట్లాడినందుకు ప్రజలు ఇతన్ని ప్రశంసించేరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రాజకీయ నాయకులు అన్యుల గురించి మాట్లాడితే అది వారికి రాజకీయ విపత్తుగా మారుతుంది.

2006 లో అన్యులు తనని అపహరించుకుపోయిన విషయాన్ని రష్యా ప్రెశిడెంట్ పుటిన్ కు తెలిపేరు.

( విషయాన్ని రష్యా ప్రెశిడెంట్ పుటిన్ కు తెలిపే ఫోటో)

2010లో బి.బి.సి. కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను చెప్పిన విషయాన్ని దర్యాప్తు చేసుకోవచ్చని బహిరంగంగా తెలిపేరు.

(Kirsan Ilyumzhinov 2007లో Al Jazeera న్యూస్ చేనల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఫోటోలు)

2016 ఫీఫా(FIFA…ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్)అంతర్జాతీయ పాలకమండలి అధ్యక్షుడు పదవికి నామినేషన్ వేయమని అందరూ Kirsan Ilyumzhinov ని అడగటంతో చదరంగ ఆట అన్యులు భూమికి తెచ్చేరనే విషయంపై మళ్ళీ చర్చ మొదలయ్యింది. ఈయన ఫీఫా అధ్యక్ష పదవికి అనర్హుడని పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు.

"ఫీఫా(FIFA…ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి పోటీ చేయాలా వద్దా అని నేనింకా నిర్ణయం తీసుకోలేదు. నిరసనలకు భయపడి కాదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నేనే గెలుస్తానని అందరూ భయపడుతున్నారు. దానికి కారణం ఫుట్బాల్ ఆటను కూడా భూమికి తీసుకు వచ్చింది అన్యులే. ఇది నేను చెప్పిన మాట కాదు. ఒకప్పటి ఫీఫా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అధ్యక్షుడు చెప్పిన మాట. ఆ రోజు ఆ అధ్యక్షుడిని ఏమీ అనలేదు. ఈ రోజు నేను పోటీచేస్తే గెలుస్తానని వారందరికీ భయం. ప్రపంచమంతా ఫుట్బాల్ ఆటను, ఫుట్బాల్ ఆటగానే చెబుతుంటే ఒక్క అమెరికాలో మాత్రం ఈ ఆటను సాకర్ అంటారు. ఎందుకో తెలుసా....అన్యులు అలా పిలవమనే ఆ రోజు ఆ అధ్యక్షునికి చెప్పేరు. ఈ విషయం ఆయన స్వయంగా చెప్పిందే" Kirsan Ilyumzhinov పత్రికా విలేఖరులకు తెలిపేరు.

ఏది ఏమైనా రెండు అగ్ర రాజ్యాలు (అమెరికా-రష్యా ) అన్యులు Kirsan Ilyumzhinov ఎత్తుకుపోయేరని చెప్పిన విషయాన్ని 28 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఖండించలేదు. ఎందుకని?.........అన్నదే చాలా మందిలో మిస్టరీగా మిగిలిపోయింది.

No comments:

Post a Comment