Saturday, June 10, 2017

వీధి సంచార మందుల విక్రేతలు....ఫోటోలు

మందులు విక్రయించటానికి ఫార్మసిస్ట్ అయ్యుండాలి. అలాగే మందులను విక్రయించటానికి ఒక షాపు/అనుమతి కూడా కావాలి. ఎందుకంటే కొన్ని మందులను ఫ్రిజ్ లో ఉంచాలి. మామూలు మందులు, షెడ్యూల్ మందులను వేరుగా ఉంచటానికి అలమరాలు కావాలి.

కానీ హైతీ దేశ రాజధాణి Port-au-Princ లో ఇవేమీ అక్కర్లేదు. మందులు పెట్టుకోవటానికి ఒక బుట్ట,వీధుల వెంట తిరగటానికి ఓపిక, రోగులకు వినబడేటట్లు అరవగలిగే గొంతు ఉంటే చాలు.....అలాంటి వారు అక్కడ చాలామంది ఉండటం, రోడ్దు రోడ్దు తిరిగి మందులు అమ్మటం....అన్నిటికంటే, అక్కడున్న ప్రజలకు మందులు తినడం: చాక్లెట్లు, మిఠాయిలు తినడం లాగా ఉండటంతో వీధి సంచార మందుల విక్రేతలు ఎక్కువమంది ఉన్నారట.......ఎంతమంది ఉన్నారంటే అక్కడ మందుల షాపు పెట్టటానికి భయపడతారట.

No comments:

Post a Comment