Saturday, June 3, 2017

వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులు.....ఫోటోలు

వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతోంది. తీవ్రమైన వడగాడ్పులతో మానవులే కాదు, ప్రకృతిలోని జీవజాలమంతా అవస్థలు పడుతోంది. దీనికంతా కారణం ప్రకృతిలో తీవ్రమైన కాలుష్యం పెరిగిపోవడం, అభివృద్ధి పేరుతో గ్లోబల్‌ వార్మింగ్‌ను మరింత పెంచే దిశగా మానవ చర్యలు ఉండటంతో వాతావరణం గతి తప్పుతోందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాలి, నీరు, పొలాలు, స్వచ్ఛమైన నీలాకాశం అన్నీ కలుషితమై భారతదేశం పర్యావరణ విషతుల్యంతో ప్రమాదపు టంచులకు చేరుతోందన్న ఆందోళన ప్రకృతి నిపుణుల్లో వ్యక్తం అవుతోంది. భారతదేశం మాత్రమే కాదు ప్రపంచమంతా ప్రమాదంలోనే ఉన్నది.

"గ్లోబల్ కార్బన్ ప్రాజక్ట్" వారు ఈ మధ్య విడుదల చేసిన డాటా ప్రకారం వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులెవరో తెలుసుకుందాం.

మొదటి స్థానం: చైనా.. సంవత్సరానికి 10,357 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది
రెండవ స్థానం: అమెరికా: సంవత్సరానికి 5,414 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
మూడవ స్థానం: ఇండియా..సంవత్సరానికి 2,274 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
నాలగవ స్థానం: రష్యా... సంవత్సరానికి 1,617 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
ఐదవ స్థానం: జపాన్....సంవత్సరానికి 1,237 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
ఆరవ స్థానం: జర్మనీ...సంవత్సరానికి 798 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
ఏడవ స్థానం: ఇరాన్...సంవత్సరానికి 648 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
ఎనిమిదవ స్థానం: సౌదీ అరేబియా....సంవత్సరానికి 601 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
తొమ్మిదవ స్థానం: సౌత్ కొరియా...సంవత్సరానికి 592 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.
పదవ స్థానం: కెనడా...సంవత్సరానికి 557 మిల్లియన్ మెట్రిక్ టన్నుల కార్బన్-డ-ఆక్సైడ్ ను విడుదల చేస్తోంది.

No comments:

Post a Comment