Sunday, June 25, 2017

ఇలాంటి పుట్టగొడుగులను మీరు చూశారా.....ఫోటోలు


సృష్టిలోని వింతమొక్కలలో ఒకటిగా ఈ పుట్టగొడుగులను పేర్కొనవచ్చు.సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభించేవి. ప్రస్తుతం చిత్తకార్తెలో సైతం ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉండి ఉరుములు ఉరిమినప్పుడు పుట్టకూడు ఉన్న పుట్టల్లో, గుట్టల్లో, నేల నుండి ఇవి పైకి పొడుచుకువస్తాయి. ఇవి పుట్టే చోట ఉండే మట్టి వదులుగా ఉంటుంది. పుట్టగొడుగుల శిలీంధ్రం ఉన్న లోతును బట్టి మట్టిలోని సారంను బట్టి వాతావరణాన్నిబట్టి వీటి పరిమాణంలో మార్పులు ఉంటాయి. ఇవి భూమిపైకి వచ్చినప్పుడు మల్లె మొగ్గ వలె కాడను కలిగి ఉంటాయి. మల్లె మొగ్గవలె ఉన్న పుట్టగొడుగులను మొడిదలు అంటారు. భూమిపైకి వచ్చిన ఒకటి రెండు రోజుల్లో ఇవి విచ్చుకుంటాయి. వీటిని గొడుగులు అంటారు. విచ్చుకున్న పుట్టగొడుగులు తొందరగా పాడవుతాయి. సహజసిద్ధంగా పెరిగే తినే పుట్టగొడుగులు తెలుపు రంగులో ఉంటాయి. పుట్టకూడు (పుట్టగొడుగుల శిలీంధ్రం) ఉన్న నల్లరేగడి భూముల్లో ఏపుగా, లావుగా పెరుగుతాయి. పుట్టగొడుగులు పచ్చివి తినరు, కూర వండుకుని మాత్రమే తింటారు. ఇవి ఒక విధమైన వాసన కలిగి ఉంటాయి. దగ్గరగా వాసన చూసినపుడు మాత్రమే వీటి యొక్క వాసనను గుర్తించగలుగుతారు.

పుట్టగొడుగులలో " ఇర్గోథియోనైన్ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి . శరీరములో యధేచ్చగా సంచరిస్తూ డి.ఎన్.ఎ. ను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు మరికొన్ని పెద్ద జబ్బులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను ఇవి ఎదుర్కొంటాయి పోర్టొబెల్లో , క్రెమిని ... రకాల పుట్టగొడుగుల్లో ఇర్గోథియోనైన్ , బటన్ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి . కొన్ని రకాలు విటమిన్ 'డ్' ఉత్పత్తికి సహకరించేవి గా పనిచేస్తాయి . పుట్టగొడుగుల్లో 90 శాతము నీరే ఉంటుంది . సోడియం ఉండదు . పొటాసియం లభిస్తుంది, కొవ్వుపదార్ధము తక్కువ .. ఫలితం గా బరువు పెరుగుతామన్న భయమే ఉండదు . రక్తపోటుకు,బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్, నియాసిన్లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్ ఈ, సెలీనియం ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.

No comments:

Post a Comment