Tuesday, June 13, 2017

సముద్రంలో మొబైల్ అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ కేంద్రం...ఫోటోలు మరియు వివరాలు

ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి భూమి మీద ఎన్నో అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు ఉన్నాయని మనకందరికీ తెలుసు. అలా మనకు తెలిసున్న వాటిలో మనదేశంలో ఉన్న శ్రీహరి కోట మరియూ అమెరికాలోని నాసా ప్రయోగ కేంద్రం మనకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. కానీ సముద్రంలో ఒక అంతరిక్ష కేంద్రం ఉన్నదని చాలామందికి తెలిసుండకపోవచ్చు. దాని గురించే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము.
సముద్రంలోని ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం పేరు "సీ లాంచ్". రెండు అతిపెద్ద ఓడలు కలిగిన ఈ “సీ లాంచ్" అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో, ఒక ఓడను అంతరిక్ష ప్రయోగ కేంద్రాలలో ఉన్నట్లే మిషన్ కంట్రోల్ కు ఉపయోగిస్తారు. రెండవ ఓడను లాంచ్ ప్యాడ్ గా ఉపయోగిస్తారు. ఇవి రెండూ సముద్రంలో తేలుతూ ఉంటాయి. ఈ మొబైల్ సముద్ర ప్లాట్ ఫారం నుండి ఇంతవరకు 31 ఉపగ్రహాలను తాయారుచేసి, ఈ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించేరు.
అత్యంత ఖరీదైన ఈ సీ లాంచ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ను 1995 లో నిర్మించేరు. ఇది ఒక సహవ్యవస్థ సంస్థ. నార్వే, రష్యా, యూక్రైన్ మరియూ అమెరికా దేశాలు కలిసి నిర్మించుకున్న ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రమును బోయింగ్ సంస్థ నిర్వహణ చేస్తుంది. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రమును రష్యా వారు నడుపుతారు.
భూమి మీద ఎన్నో ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు ఉన్నప్పుడు సముద్రంలో ఒకటెందుకని అందరికీ అనిపించవచ్చు. కానీ దీని వలన ఎంతో లాభం ఉన్నది. ఆ లాభమేమిటంటే ఈ మొబైల్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ను భూమధ్యరేఖకు దగ్గరగా తీసుకువెళ్ళి ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు.
భూమధ్యరేఖ దగ్గర భూమి చూట్టే వేగం గంటకు 1,674 కి.మీ. భూమి మీదున్న కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర భూమి చుట్టే వేగం గంటకు 1,470.23 కి.మీ . అందువలన భూమధ్యరేఖ దగ్గర నుండి ఉపగ్రహాలను ప్రయేగిస్తే అవి తక్కువ సమయంలో అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి. దీని వలన ఉపగ్రహం పయనించే దారిని మార్పు చేయవలసిన అతిపెద్ద పని తగ్గుతుంది. దీని వలన ర్యాకెట్లో ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది.

No comments:

Post a Comment