Thursday, April 27, 2017

ఈ డాక్టర్ రోజూ 500 మంది అనాధ వృద్దులకు ఉచిత భోజనం అందిస్తున్నాడు....ఫోటోలు

ముంబైకు చెందిన Dr. Uday Modi రోజూ 500 మంది అనాధ వృద్దులకు ఉచిత భోజనం అందిస్తున్నాడు. ఇలా గత పది సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు.

గుజరాత్ నుండి ముంబైకు వృత్తి రీత్యా వలస వచ్చిన ఈ డాక్టర్ ఇంటికి పది సంవత్సరాల క్రితం 70 ఏళ్ళ వృద్ద దంపతులు వచ్చారు. ఆరొగ్య ఇబ్బందుల వలన తనను చూడటానికి వచ్చారనుకున్నాడు. కానీ ఆ దంపతులు ఆకలిగా ఉన్నది...అన్నం పెట్టండని అడిగారట. వారి రోదనకు కరిగిపోయిన Dr. Uday Modi వారికి అన్నం పెట్టి పంపించాడు.

మరుసటి రోజు నుండి తన సేవా కార్యక్రమం మొదలుపెట్టాడు. మొదట, రోజుకు ఒక క్యారేజీతో ముంబైలోని కొంత మంది అనాధ వృద్దులకు ఉచిత భోజనం అందించిన ఈ డాక్టర్, ఇప్పుడు 500 క్యారేజీలతో తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.

No comments:

Post a Comment