Wednesday, March 8, 2017

ఆశక్తికరమైన/ప్రమాదమైన సింక్ హోల్స్ (Sinkhole...హఠాత్తుగా ఏర్పడే లోతైన అగాథం)...ఫోటోలు

జియాలజీ ఊహాజనితం. సింక్‌హోల్‌ అనేది కొత్తగా ఉన్నా.. ఇదో భయంకరమైన ప్రకృతి విపత్తు. భూమి తనంతట తాను లోపలికి క్రుంగిపోతుంది. అలా క్రుంగిపోయి ఏర్పడిన అతిపెద్ద అగాధాలలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం. దీనంతటి కారణం ఎవరో కాదు. మనుషులే. మనుషులు మనుషుల్లా కాకుండా.. మిషిన్లలా.. కొత్త విషయాలు కనుక్కోవడానికి చేస్తున్న పనుల కారణంగా.. భూమికి, ప్రకృతికి కోలుకోలేని డ్యామేజ్ జరుగుతోంది. ఇలాంటి విపత్తులను చూసిన తర్వాత అయినా మనుష్యుల్లో మార్పు రాకపోతే. ఇక భూమి అంతరించిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైంటిస్ట్ లు.

రష్యాలో ఏర్పడిన బెరెజ్నికి సింక్‌హోల్‌ ఇది. దీని పొడవు 80 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు. దీని లోతు 200 మీటర్లు ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. దీన్ని మళ్లీ ఏర్పాటు చేయడానికి రష్యా దీనిపై పనిచేస్తోంది.
బెలీజ్ లోని బ్లూ హోల్ ఇది. విభిన్నమైన సింక్‌హోల్‌ మాత్రమే కాదు.. ఇది ఆకాశం నుంచి చూడగలిగిన ఒకే ఒక్క రంధ్రం.
వెనుజులాలోని బోలివర్ స్టేట్ లో ఉన్న అతిపెద్ద సింక్‌హోల్‌. దీని లోతు 314 మీటర్లు , వెడల్పు 352 మీటర్లు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇజ్రాయిల్ డెడ్ సీ సింక్‌హోల్‌ ఇది. దీని లోతు దాదాపు 3 వేల మీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ నీటి సమస్య ఉండటం వల్ల ఈ సింక్‌హోల్‌ అగాధం ఏర్పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
గాటెమాలాలో 2007 ఫిబ్రవరి 23న గాటెమాలా సిటీలో భూమి లోపలికి వెళ్లిపోవడం వల్ల ఈ సింక్‌హోల్‌ ఏర్పడింది. ఇది చాలా లోతుగా.. రంధ్రంలా ఏర్పడింది.
చైనా క్జియోజై టియానాకెంగ్ సింక్‌హోల్‌. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింక్‌హోల్‌. ఇది 626 మీటర్ల పొడవు, 537 మీటర్ల వెడల్పు ఉంటుంది.
ఈ సింక్‌హోల్‌ ని ఫ్లోరిడా డెవిల్స్ టాయిలెట్ బౌల్ అని పిలుస్తారు . ఇది గతంలో కనిపించేది కాదు. తర్వాత ఇది పిక్ నిక్ స్పాట్ లా మారింది. ఇక్కడ చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.
2014 ఫిబ్రవరి నెలలో జనరల్ మోటార్స్‌కు చెందిన జాతీయ కార్వెట్ మ్యూజియంలో సుమారు 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతున్న సింక్‌హోల్ ఏర్పడి, 8 వెలకట్టలేని పురాతన షెవర్లే కార్వెట్ కార్లు ధ్వంసమైన సంగతి తెలిసే ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ సింక్‌హోల్ మంచి పాపులరాటీని దక్కించుంది. కార్వెట్ మ్యూజియంను సందర్శించడానికి వచ్చే వారి సంఖ్య కన్నా ఈ సింక్‌హోల్‌ను సందర్శించడానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందట. ఈ నేపథ్యంలో, జాతీయ కార్వెట్ మ్యూజియం లోపలి వైపు ఏర్పడిన ఈ సింక్‌హోల్‌ను మూసివేయకుండా అలానే ఉంచాలని అధికారులు నిర్ణయించారట. అంతేకాకుండా, సింక్‌హోల్ నుంచి బయటకు తీసిన డ్యామేజ్ అయిన కార్లను కూడా తిరిగి సింక్‌హోల్‌లోనే ఉంచారట.

No comments:

Post a Comment