Tuesday, March 7, 2017

రైన్ బో రంగుల కొండలు....ఫోటోలు

ప్రకృతి ఎన్ని రకాల సొబగులతో మనల్ని మురిపిస్తుందో మీకందరికీ తెలుసు. కొండలు, గుట్టలు, లోయలు, నదులు, చెట్లు, కొమ్మలు, ఆకులు, పూలు...అసలు అందం లేనిదేది? ఆకట్టుకోనిదేది? అలా తమ అందాలతో కనువిందు చేసేవి,ఆశ్చర్యపరిచేవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రాకృతిక సౌందర్యాన్ని చూడాలంటే పెట్టిపుట్టాలేమో అనిపిస్తుంది.వాటిలో ఒకటి...రైన్ బో రంగుల కొండలు.

వరుస సెలవు దినాలు వస్తే చాలు ఎక్కడికి వెళ్దాం.. .ఏ ప్రదేశాన్ని చుట్టేసొద్దాం అంటూ ఆలోచిస్తారు పర్యటకప్రియులు. ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లి సేదతీరుదామా అని నెట్టింట్లోకి వెళ్లి వెతికేస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి ఆసక్తికర ప్రదేశాలలో అందాలతో కనువిందు చేస్తూ ఆశ్చర్యపరిచేవి రైన్ బో రంగుల కొండలు.

ఈ రైన్ బో కొండలు ప్రపంచంలో మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. చైనా, పెరు మరియు కెనడా దేశాలలో ఉన్నాయి. చైనా, పెరు దేశాలలో ఉన్న కొండలు ప్రశిద్ది చెందినవి.

చైనాలో ఉన్న కొండలు
పెరు దేశంలో ఉన్న కొండలు
కెనడాలో ఉన్న కొండ

No comments:

Post a Comment