Friday, March 17, 2017

అందమైన నౌకాశ్రయ ప్లాట్ఫారాలు....ఫోటోలు

భూమి చుట్టూ సముద్రం ఉన్నది. ఒకప్పుడు ఈ సముద్రాలలో ప్రయాణం చేసి దూరదేశాలను చేరుకునేవారు. కానీ విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రాగానే ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవటం మొదలుపెట్టేరు. దానికి ఒకే ఒక కారణం, వేగంగా గమ్యానికి చేరుకోవడం. దీనితో నౌక ప్రయాణం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు సరకుల రవాణా కోసం మాత్రమే నౌకలను వాడుతున్నారు.

నౌకాశ్రయాలలో కూడా ప్లాట్ఫారాలు ఉండేవి. ప్రయాణీకులను నౌకలవరకు తీసుకు వెళ్ళడానికి వీటిని అమర్చేరు. చాలా నౌకాశ్రయాలలో ఇప్పుడు ఈ ప్లాట్ఫారాలు కనబడవు. కొన్ని దేశాలలో మాత్రం వాటిని(నౌకాశ్రయ ప్లాట్ఫారాలను) పర్యాటక ప్రదేశాలుగా ఉంచేరు. వాటినే మనం ఇక్కడ చూడబోతున్నాము.

No comments:

Post a Comment