Monday, March 27, 2017

జపాన్ దేశంలో కొన్ని డ్రైనేజ్ కాలువలు ఎంత శుభ్రంగా ఉన్నాయో చూడండి....ఫోటోలు


రాతి ఎద్దు....ఫోటోలు

ఇండోనేషియా సముద్ర తీరానికి దగ్గర సముద్రంలో నీలబడి ఉండే ఈ కొండరాయి ఒక ఎద్దు ఆకారంలో ఉంటుంది. ఈ ఎద్దు నీరు త్రాగుతున్నట్టు ఉండటం ఒక ప్రత్యేక ఆకర్శణ కావటంతో ఇది ఒక పర్యాటకుల ద్రుశ్యంగా మారింది. మరి మీరు కూడా ప్రక్రుతి నిర్మించిన ఆ రాతి ఎద్దును చూడండి.

Sunday, March 26, 2017

అద్భుతమైన అఖాతాలు....ఫోటోలు

Ha Long Bay...North Vietnam
Guanabara Bay...South east Brazil
San Francisco Bay...Californian coast
Port Jackson...Sydney
Victoria Harbour...Hong Kong
Phang Nga Bay...Thailand
Bay of Islands...New Zealand
Bay of Fundy...Canada

Saturday, March 25, 2017

అందమైన పౌర్ణమి చంద్రుడు....ఫోటోలు


నేనే నాట్యా మయూరిని----(లెమర్) ఓ పొట్టి వానరం...ఫోటోలు

గుడ్లగూబ లాంటి కళ్లు, పిడికెడు శరీరం, నక్కలాంటి లావాటి తోక. ఇది కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం.ఇది ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల కంటబడింది. అయితే అసలు ఇది ఏ జాతికి చెందుతుందని చెప్పడానికి ఇన్నేళ్లు పరీక్షలు గట్రా జరిపి ఇప్పుడు ఇది లెమర్ జాతిదేనని తేల్చారు.లెమర్లు మొత్తం సుమారు వంద జాతులు. వాటిల్లో అయిదు పొట్టి జాతివి ఉన్నాయి. ఈ పొట్టివాటిల్లో ఈ కొత్తదీ చేరిపోయింది.లెమర్లు ఆఫ్రికా దగ్గరలోని మడగాస్కర్ దీవిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి.

ఈ కొత్త వానరాన్ని లావాసో పర్వతాల్లో గుర్తించారు కనుక 'లావాసో డ్వార్ఫ్ లెమర్' అనే పేరుపెట్టారు!

ఇది కేవలం పావుకిలో బరువు, 20 అంగుళాల పొడవుంటుంది. గుండ్రని కళ్లు, చిక్కని బొచ్చు, పెద్ద పెద్ద చెవులతో ఉండే వీటి శరీరం ముదురు ఎరుపురంగులో ఉంటుంది. ఇవి రాత్రిళ్లు మాత్రమే తిరుగుతాయి. అడవిలో దట్టమైన పొదలపై వీటి కాపురం. చలికాలంలో సోమరిగా నెలలకొద్దీ చెట్లపైనే గడుపుతాయి. మిగితా కాలాల్లో మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి! వీటి పోలికలు మిగతా లెమర్ల పోలికలకు దగ్గరగానే ఉన్నా, ఓ పట్టాన మనుషుల కంట పడవు. తప్పించుకుపోయే తత్వం ఎక్కువ. అందుకే ఇవి ఎలా జీవిస్తాయో ఎక్కువగా తెలుసుకోవడానికి వీలు కాలేదు.

మడగాస్కర్ దీవిలో స్థానిక భాషలో 'లెమర్' అంటే దెయ్యం అని అర్థం.

Friday, March 24, 2017

పిరికితనం చూపించకుండా ధైర్యం చూపిస్తే క్రూరులైనా స్నేహితులవుతారు.....ఫోటోలు మరియు వీడియో

రష్యా దేశంలో జరిపిన ఒక పరిశోధనలో పిరికితనం చూపించకుండా ధైర్యం చూపిస్తే క్రూరులైనా స్నేహితులవుతారు అన్నది నిరూపించబడింది. ఆ దేశంలోని ఒక ఒక జూలో క్రూరమ్రుగమైన పులికి ఆహారంగా ఒక మేకను అందించారు. పులిని చూసి పిరికితనంతో భయపడక, ధైర్యంగా ఆ పులి ముందు నిలబడటంతో...ఆ పులి, ఆ మెకను స్నేహితునిగా అంగీకరించి రెండు సంవత్సరాలుగా ఆ మేకతో సరదాగా ఉండటం జూ అధికారులను ఆశ్చర్య పరిచింది. ఇది కథ కాదు. నిజం.


వీడియో