ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Wednesday, February 8, 2017
ఇప్పటికీ రోజుకు 4 ఆపరెషన్లు చేస్తున్న 90 సంవత్సరాల మహిళా సర్జన్....ఫోటోలు
ముసలితనం మనల్ని నిదానపరుస్తుంది అని అనుకుంటే మనం ఒక సారి 90 సంవత్సరాల వయసున్న ఈ మహిళా శస్త్రచికిత్స వైద్యురాలుని తప్పక కలుసుకోవలసిందే.
ఆమె పేరు Alla Illyinichna Levushkina. మాస్కో నగరానికి చెందిన Ryazan City Hospital లో శస్త్రచికిత్స వైద్యురాలుగా పనిచేసున్నది. ఈ వయసులోనూ ఆమె రోజుకు నాలుగు ఆపరేషన్స్ చేస్తోందట. గత 67 సంవత్సరాలు శస్త్రచికిత్స వైద్యురాలుగా సుమారు 10,000 ఆపరేషన్లు చేసిందట. "రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు" అంటున్న ఈమె డాక్టర్ అనేది ఒక ఉద్యోగ వృత్తి కాదు, అది ఒక జీవన శైలి అంటోంది.
ఇంటిదగ్గర వికలాంగ మేనల్లుడుని మరియూ 8 పిల్లులను అమె జాగ్రత్త తీసుకోవడం అమె మనొభావాన్ని తెలియపరుస్తోంది.
దేవుడు ఆమెకు దీర్గాయుస్సు ఇవ్వాలని కొరుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment