Tuesday, May 23, 2017

రంగు రంగుల సాగరతీరాలు……ఫోటోలు

బీచ్ లంటే చాలా మందికి ఇష్టం. అక్కడకి వెళ్ళాలన్నా, అక్కడ గడపాలన్నా చాలా మందికి మంచి సరదా. బీచ్ ఫాషన్ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. విదేశాలలో బీచ్ సన్ బాత్ వారికి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.

బీచ్ లు చాలా అందమైనవి , ఉత్సాహభరితమైనవి. ప్రకృతిని ఆశ్వాదించే అద్భుతమైన ప్రదేశాలు.

కుటుంబంతో సహా చాలా ఆనందంగా గడిపే తీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడకు వెడితే మనసు తేలికపడుతుంది. ఎందుకంటే బీచ్ లు ఆనందాన్ని పంచి పెడతాయి. అలాంటి సాగరతీరాలలో ఇసుక సాధారణంగా బంగారు రంగులో ఉంటుంది.

కానీ ప్రపంచములోని కొన్ని బీచ్ లలో ఇసుక సాధరణ బంగారు రంగులో కాకుండా వింత రంగులో ఉన్నది. దీనిని ప్రకృతి వింతగా చూస్తున్నారు. అలాంటి వింత రంగు ఇసుక కలిగిన సాగరతీరాలను ఇక్కడ చూద్దాం.

Black Sand Beach, Iceland.
Red Sand Beach, Greece.
Green Sand Beach, Hawaii, USA.
Pink Sand Beach, Komodo Island, Indonesia.
Shell Beach, Australia.
Rainbow Beach, Australia.
Purple Sand Beach, Big Sur, California.
Orange-colored Sand Beach, Sardinia, Italy.
Glowing Blue Maldives Beach with Bioluminescent Phytoplankton.
Glass Beach, California, USA.

పూర్వీక సంచార గ్రంధాలయాలు.....ఫోటోలు

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంధాలయము. తెలుగులో గ్రంధాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంధాలయ పితామహుడు అనే పేరు పొందిన వారు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉధ్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

గ్రంధాలయాలు సమజానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రంధాలయాల ద్వారా ఎందరో మేధావులు విజ్ఞానాన్ని సంపాదించి మహోన్నతులయ్యారు. విధ్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాతమకత, మేధసుును పెంపొందించుకునేందుకు గ్రంధాలయాలు దోహదపడతాయి.

ఇంటర్నెట్ ఉపయోగం పెరిగిన ఈ రోజుల్లో పుస్తకాలకొరకు ప్రజలు అంతర్జాలంలో అంతర్జాల గ్రంధాలయాలను వెతుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఉచితంగా పుస్తకాలను చదువుకునే పద్దతి పోయి ఇప్పుడు గ్రంధాలయాలను లాభాలకోసం వాడుకుంటున్నారు.

ప్రపంచం అభివ్రుద్ది చెందిన ఈ కాలంలో కన్నా పూర్వం పుస్తకాలను ఒకేచోట చేర్చి సంచార గ్రంధాలయాలను ఏరపరచిన ఆ నాటి వ్యక్తులు ఎప్పటికీ గొప్పవారే.

Monday, May 22, 2017

యు.ఎఫ్.ఒ ఆకారాలలో భవనాలు....ఫోటోలు

గుర్తించబడని ఎగురుతున్న వస్తువును (సాధారణంగా అన్ ఐడెంటిఫైడ్ ఆబెజక్ట్ అంటారు) యు.ఎఫ్.ఒ అని పిలుస్తారు. సంయుక్త రాష్ట్రాల వాయుదళం 1952 లో ఈ పదాన్ని ప్రవేశపెట్టింది. ప్రసిద్ద సంస్క్రుతి తరచుగా యు.ఎఫ్.ఒ ను గ్రహాంతరవాసి రోదసి నౌకకి పర్యాయపదంగా వాడుతోంది. ఈ విషయిం చుట్టూ కల్పితాలు మరియు జానపద కధలు ఉద్భవించాయి. ప్రైవేట్ పైలట్ అయిన కెన్నత్ ఆర్నోల్డ్ 1947 లో ఇచ్చిన నివేదిక నుండి మొదటగా, విస్తారంగా ప్రచారం జరిగిన యు.ఎఫ్.ఒ వీక్షణ తరువాత యు.ఎఫ్.ఒ నివేదికలు చాలా తరచుగా రావటం మొదలయ్యింది మరియు రెిండు ప్రసిద్ద పదాలు అయన "ఫ్లయింగ్ సాసర్" మరియు "ఫ్లయింగ్ డిస్క్"లు ఉద్భవించాయి. అప్పటి నుండి లక్షల మంది ప్రజలు తాము యు.ఎఫ్.ఒ లను చూశామని నివేదించారు. నిజంగా ఇవి ఉన్నాయో, లేవో తెలియదు. కానీ ఇవి ఉన్నట్లు నమ్మే ప్రజలు చాలామంది ఉన్నారు. వీటిని చూశామని చెప్పిన వారిలో కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారు చూశేమని చెప్పి వాటి ఆకారమును కూడా వివరించారు. దీనితో వీటి మీద ఆశక్తి గల కొందరు ఆ ఆకారాలలో భవనాలు/ ఇళ్ళు కట్టుకున్నారు.

The Flying Saucer House - Chattanooga, Tennessee, USA.
The Circus - Astana, Kazakhstan.
Sanzhi UFO houses - New Taipei City, Taiwan.
Pensacola Beach’s Spaceship House – Florida, USA.
Universum Science Center - Bremen, Germany.
Chemosphere House - Los Angeles, California, USA.
The Buzludzha Monument – Bulgaria.
Niterói Contemporary Art Museum - Rio de Janeiro, Brazil.