Friday, December 23, 2016

డోనాల్డ్ ట్రంప్ కు బహుమతిగా బాంగారు ఐఫోన్(iPhone 7)....ఫోటో

అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు బహుమతిగా ఇవ్వడానికి చైనా దేశానికి చెందిన ఒక కుటుంబం వజ్రాలు అమర్చిన బంగారు ఐఫోన్7 ను తయారు చేసి ఇమ్మని ఒక కంపెనీని అడిగిందట. ఆ కంపెనీ తయారుచేసిన బంగారు ఐఫోన్ ను డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా అధ్యక్ష పదవి చెపట్టే రోజున బహుమతిగా అందించాలని నిర్ణయించుకున్న ఆ కుటుంబం ఆ ఫోను కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టిందట.

Thursday, December 22, 2016

40 ఏళ్ళ తరువాత సహారా ఎడారిలో మంచు... ఫోటోలు

ఎడారి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘సహారా’. పగటి వేళల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. వడగాలులూ నిప్పు సెగలు కురిపిస్తుంటాయి. అయితే, ప్రపంచంలోనే పెద్దదైన సహారా ఎడారిలో మంచు కురిసింది. అల్జీరియాలోని అయిన్ సెఫ్రా పట్టణ సమీపంలోని ఎడారిలో మంచు కురవడంతో ఇసుక దిబ్బలు తెల్లగా మారిపోయి కొత్త అందాలను సంతరించుకున్నాయి. ఈ అందాలు ‘సహారా’ సందర్శకులకు మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాగా, సెఫ్రా పట్ణణ సమీపంలో మంచు కురిసిన విషయాన్ని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ముప్ఫై ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ మంచు కురిసిన విషయాన్ని ఈ సందర్భంగా అక్కడి వృద్ధులు గుర్తుచేసుకున్నారు.