Tuesday, October 4, 2016

పిల్లికి విగ్రహం: గౌరవం చెల్లిస్తున్న పొరుగు పిల్లులు....ఫోటోలు

ఇస్తాంబుల్(టర్కి)నగరంలో జీవితం కొనసాగిస్తున్న టామ్ బిలి అనే పేరు కలిగిన ఒక పిల్లి ఒకరోజు అద్భుతమైన ఫోజుతో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో ఆ పిల్లిని ఫోటో తీసేరు. ఆ తరువాత ఆ ఫోటో వలన ఆ పిల్లి ప్రసిద్ది చెందింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఆ పిల్లి చనిపోయింది. అంత అద్భుత ఫోజు ఇచ్చిన పిల్లిని మర్చిపోకూడదని, దాని గౌరవార్ధం ఆ పిల్లి ఫోజు ఇచ్చిన చోటే ఆ పిల్లికి ఒక విగ్రహం చేయించేరు స్థానికులు.

అన్నిటికంటే ఆశ్చర్యమేమిటంటే టామ్ బిలి కి నివాళులు సమర్పించే విధంగా చుట్టుపక్కల ఉంటున్న పొరుగు పిల్లులు ఆ విగ్రహం దగ్గరకు వచ్చి కాసేపు కూర్చోని వెడుతున్నాయట!

No comments:

Post a Comment