Sunday, October 30, 2016

"ట్రీ ఆర్ట్": తో రూపొందించుకున్న చెట్లు......ఫోటోలు

చెట్లను మనకు కావలసినట్లు మలుచుకుని రూపొందించుకోవటాన్ని "ట్రీ ఆర్ట్" అంటారు. మామూలుగా మనం చెక్కలతో తయారుచేసిన కుర్చీలు, బల్లలు లాంటి వాటిని చూశే ఉంటాము. కానీ బ్రతికున్న చెట్లనే అలాంటి వస్తువులుగా రూపొందించుకోవటం ఒక కళ.

Saturday, October 29, 2016

కీచురాయి పందాల: 75 మిల్లియన్ అమెరికన్ డాలర్ల టర్నోవర్...ఫోటోలు

చైనా ప్రజలకు కీచురాయి(ఉప్పు మిడత)పందాలు అతి పెద్ద వినోదం. 1000 సంవత్సరాలకు ముందు చైనా రాజవంశీకులు లో మొదలైన ఈ కీచురాయి పందెం క్రమముగా చైనా ప్రజలందరికీ పెద్ద వినోదముగా మారింది. కీచురాయిని పంజరములో బందించి అవి చేసే చప్పుడు విని ఆనందించేవారట. ఇలాంటి ఒక పందెములో రాజ్యాలే కోల్పోయేవారట. ఈ పందెం ను నెత్తుటి ఆట అని కూడా అంటారు. కమ్యూనిస్టులు చైనా పరిపాలనను చేజిక్కించుకున్న తరువాత ఈ కీచురాయి పందాలను నిషేదించేరు. కానీ చట్ట విరుద్దంగా చాలా చోట్ల ఈ పందాలు ఆడేవారుట.

కొద్దికొద్దిగా చైనా ప్రభుత్వం ఈ పందాలను పెద్దగా పట్టించుకోవటం మానేయడంతో ఇప్పుడు ఈ పందాలు నగరాలలో అందరికీ తెలిసే జరుగుతోందట. కీచురాయిని ఆమ్మే షాపులు కూడా తెరిచేరు. ఒక కీచురాయిని 100 రూపాయల నుండి 2,000 రూపాయలదాకా అమ్ముతారట. రోడ్ల మీద,క్లబ్బులలో ఈ పందాలు జరుగుతున్నాయట.2010 లో ఈ కీచురాయి పందాల మార్కెట్ సుమారు 75 మిల్లియన్ అమెరికన్ డాలర్ల మేరకు విలువ చేసిందంటే ఈ కీచురాయి పందాల మీద చైనా ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారో ఊహించుకోవచ్చు.