Wednesday, September 7, 2016

మిస్టరీ: సంఖ్యలు భవిష్యత్తు గురించి చెబుతున్నాయా?....ఫోటోలు మరియు వివరాలు

సంఖ్యలు భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నాయా?.... ఇది ఈ రోజుకీ ఒక మిస్టరీగానే ఉన్నది.

సంఖ్యాశాస్త్రము మరియు సంఖ్యాపరంగా భవిష్యత్తు చెప్పటంలో ముందుతరం గణితశాస్త్రవేత్తలు ప్రసిద్దిచెందారు, ఫైతాగరస్ సిద్దాంతము వంటివి. కానీ వీటిని ఆధునిక శాస్త్రవేత్తలు గణితశాస్త్రములో భాగంగా గుర్తించటం లేదు. ఇంకా దీనిని కపటమైన గణితశాస్త్రముగా పేర్కొంటున్నారు. సంఖ్యాశాస్త్రము సంఖ్యలకు, సాకారమైన వస్తువులకు లేక ప్రాణముతో ఉన్న వాటికి సంబంధించిన సంప్రదాయాలు లేక నమ్మకాలు మాత్రమేనని చెబుతున్నారు.
"సంఖ్యలు అనేవి సత్యాన్ని ధృవపరచటానికి దైవముచే మానవులకు ఇవ్వబడిన విశ్వభాష, ప్రతి దానికీ సంఖ్యలతో సంబంధముంటుంది కానీ ఈ సంబందాల రహస్యాలను పరిశీలించటం, వెతకటం అనేది మనసు మీద ఆధారపడి ఉంటుంది లేదా సంఖ్యా రహస్యాలను వెల్లడి చేయటం దేవుని దయమీద ఆధారపడి ఉంటుంది" అని వెల్లడించారు సెయింట్ అగస్టిన్ అఫ్ హిప్పో (A.D. 354–430).

నిజమే...ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒకే సంఖ్యను మంచిదనో లేక చెడ్డదనో చెప్పటంలేదు. ఒకరికి మంచిదనే సంఖ్య మరొకరికి చెడు సంఖ్య అవుతోంది. ఎవరికి వారు తమకు నచ్చని సంఖ్య, నచ్చే సంఖ్య ఎన్నుకుంటున్నారు. నిజంగానే సంఖ్యలు మంచి చెడులను తెచ్చిపెడతాయా?... అంటే, ఎవరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

"కానీ సంఖ్యలకూ మంచి చెడులకు సంభంధం ఉంది...ఈ విషయాన్ని రుజువు చేయటమే అతిపెద్ద మిస్టరీగా ఉన్నది. అందుకనే ఈ సంఖ్యాశాస్త్రం మూఢనమ్మకాలకు దారి తీస్తోంది" అని ప్రపంచ ప్రఖ్యాత న్యూమరాలజిస్ట్ ఒకరు తన ఆవేదన వ్యక్తం చేసేరు.....ఆయన అలా ఎందుకన్నరో ఒకసారి తెలుసుకుందాం.

మూఢనమ్మకాలు కలిగించిన కొన్ని సంఖ్యలు:

పశ్చిమ దేశాలలో 13 సంఖ్యను ప్రముఖంగా దురదృష్టమైనదిగా భావిస్తారు. దురదృష్టమైన సంఖ్యలలో ఇది ఒంటరిదీ కాదు. దీనితోపాటు చాలా సంఖ్యలను, అవి ఏర్పరచిన సంధర్భాలను బట్టి వాటిని దురదృష్టమైనవిగా భావించి నివారిస్తున్నారు.
ఫోన్ నెంబర్ 0888 888 888: బల్గేరియా దేశ మొబైల్ కంపెనీ మొబిటెల్ ఈ ఫోన్ నెంబరును పూర్తిగా నిషేదించింది. కారణం, మొదట ఈ నెంబర్ను ఆ కంపెనీ సి.ఈ.ఓ వాడేరు. ఆయన క్యాన్సర్ వ్యాధితో చనిపోయేరు. ఆ తరువాత ఆ నెంబరును మరొకరికి కేటాయించేరు. ఆయన కూడా మరణించేడు. మూడోసారి ఆ నెంబర్ను తీసుకున్న వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. అంతే, దీనితో ఆ కంపెనీ ఆ నెంబరును పూర్తిగా నిషేదించింది.
నెంబర్-11: అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి....దాడి జరిగిన రోజు 9/11 - 9 + 1 + 1 = 11. రెండు భవనాలలోనూ 110 అంతస్తులు. దాడి జరిగిన సెప్టంబర్ 11 వ రోజు ఆ సంవత్సరంలోని 254 రోజు: 2 + 5 + 4 = 11. రెండు భవనాలూ పక్కపక్కన నిలబడితే 11 లాగా కనబడతాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని మొదటి భవనంపై దాడి చేసిన మొదటి విమానం నెంబర్ 11. న్యూ యార్క్ సిటి(New York City) 11 అక్షరాలు. దాడికి సూత్రధారి అని చెప్పి ఖైదు చేయబడ్డ రంజీ యూసఫ్ (Ramzi Yousef) పేరులోని అక్షరాలు 11. ఫ్లైట్ 11 లో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులు 92(9+2=11). ఫ్లైట్ 11 లో ఉన్న విమాన సిబ్బంది 11 మంది. రెండో విమానం ఫ్లైట్ నెంబర్ 77లో ఉన్న మొత్తం మంది 65(6+5=11).
నెంబర్-7: అనేక సంస్కృతులు 7 ని దురదృష్టమైన సంఖ్యగా భావిస్తారు. ఇందులో ముఖ్యమైనది చైనా. చైనాలో ఈ అంకెను పరిత్యజించడం, కోపం, మరణంతో పోలుస్తారు. చైనా క్యాలండర్లో 7 వ నెలను దెయ్యాల నెలగా చెబుతారు. ఎందుకంటే ఆ నెలలో దెయ్యాలు విడుదల అవుతాయట. 2014(2+0+1+4=7)లో 7 రోజుల వ్యవధిలో యూక్రైన్, మాలి, తైవాన్లలో 3 విమానాలు కూలిపోయినై. ఆ సంవత్సరం జూలై-17 న MH-17 విమానాన్ని 17.17 కి కూల్చివేసేరు. ఆ విమానం బోయింగ్ 777. 17 సంవత్సరాల వాడకం తరువాత జరిగిన ఘోరం. అదే సంవత్సరం 7 నెల, 7 వ తారీఖున సరిగ్గా 17 గంటల కాలమానానికి ఒక భారతీయ మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. అందులో ఉన్న 7 గురు మరణించేరు.
నెంబర్-26(8): భారతదేశానికి 26 దురదృష్టకరమైనది. 20,000 మంది ప్రాణాలు బలిగొన్న 2001 గుజరాత్ భూకంపం ఆ సంవత్సరం జనవరి-26 న సంభవించింది. 2004 లో 2,30,000 మందిని బలిగొన్న ఇండియన్ ఓషన్ సునామీ డిసెంబర్-26 న సంభవించింది. మే-26-2007, గౌహాతీలో చాలా చోట్ల బాంబు పేలుడ్లు. జూలై-26, 2008 అహమదాబాద్ బాంబుపేళుళ్ళు. నవంబర్-26 ముంబై నగరంలో టెర్రరిస్ట్ దాడులు.
నెంబర్-4: చైనా, తైవాన్, సింగపూర్, మలేషియా, జపాన్, కొరియా, వియత్నాం దేశాలలో ఈ సంఖ్యను నివారిస్తారు. ఈ సంఖ్య మరణంతో సామానమట. అందుకని ఈ దేశాలలో ఈ సంఖ్య వాడకాన్ని నివారిస్తారు. మాట్లాడేటప్పుడు కూడా ఈ సంఖ్యను ఉచ్చరించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. భవన అంతస్తులలో, లిఫ్టులలో, ఎలివేటర్లలో, యుద్ద విమానాలలో, నౌకలలో, రూము నెంబర్లు, ఇంటి నెంబర్లలో 4 రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. 3 తరువాత 4 కు పెట్టవలసిన అంకెను 3A గా పెడతారు.

"సంఖ్యలు వేటినో సూచిస్తున్నాయి...వాటి మీద సైంటిఫిక్ పరిశోధన జరిపితే సంఖ్యలలోని మిస్టరీ తొలగిపోతుంది" మరొక న్యూమరాలజీ నిపుణుడు తెలిపేరు.

No comments:

Post a Comment