Friday, September 23, 2016

మిస్టరీ: మాంత్రీక బావి...ఫోటోలు మరియు వివరాలు

ఎస్టోనియా దేశములో తుహలా అనే గ్రామములో ఉన్నది ఈ మాంత్రీక బావి.

ఎస్టోనియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర యూరప్ బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తరాన ఫిన్లాండు, పశ్చిమాన స్వీడెన్, దక్షిణాన లాట్వియా మరియు తూర్పున రష్యా దేశాలు ఎల్లలుగా గలవు.
ఎస్టోనియా దేశములోనే తుహలా అనే ఈ గ్రామములో అత్యధికమైన భూగర్బ బావులు మరియూ నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహలాలో ఉన్న ఈ మాంత్రీక బావి అత్యద్భుత ప్రకృతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్న ఈ బావి నుండి వర్షాకాలములో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్త ప్రాంతమునూ వరదతో ముంచుతుంది. ప్రతి సంవత్సర వర్షాకాలములోనూ అలా జరగదు. ఏ రెండు, మూడు సంవత్సరాలకో అలా జరుగుతుంది. కేవలం మూడు లేక నాలుగు రోజులు మాత్రమే అలా జరుగుతుంది. అందుకే ఈ బావిని మాంత్రీక బావి అంటారు.
ఈ గ్రామములో నివసించే ప్రజలు దీనికి మాంత్రీక బావి అని పేరుపెట్టేరు. వారి కధల ప్రకారం ఇద్దరు మంత్రగాళ్ళు భూమి క్రింద యుద్దం చేసుకోవటంవలనే ఇలా బావి నుండి నీరు వచ్చి వరదగా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడు మేము ఈ బావి మీద రెండు మండుతున్న రూపాలను చూసేమని చెబుతారు. ఇది ఒక మాంత్రీక ప్రదేశం. ఇక్కడ ఉండటం మా అదృష్టం అని చెబుతారు.

నీళ్ళు రానప్పుడు బావి
"ఎస్టోనియా మొత్త ప్రదేశం సహజ మంత్ర శక్తి నిండిన ప్రదేశం. దానిని వివరించడం/వర్ణించడం చాలా కష్టం. కొన్ని సార్లు వివరించకుండా ఉండటమే మంచింది. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలు చాలావరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి" అక్కడ నివసిస్తున్న 37 సంవత్సరాల Mari-Liis Roos అంటారు.
ఎప్పుడు ఆ బావిలో నుండి నీరు వస్తుందో తెలియదు కాబట్టి, అలా వచ్చినప్పుడు ఎస్టోనియా దేశములో నివసిస్తున్నవారే గబుక్కున ఆ చోటుకు చేరుకోగలరు, ఆ వింతను చూడగలరు. మూడు, నాలుగు రోజులు మాత్రమే ఆ బావి నుండి నీరు పైకి ఉబికి వస్తుంది కాబట్టి బయటి దేశంలో ఉన్నవారు ఆ వింతను చూడటానికి ఆ సమయానికి అక్కడికి చేరుకోలేరు.

17 సంవత్సరాలుగా, అంటే ఎప్పుడైతే సోవియట్ యూనియన్ దగ్గర నుండి స్వాతంత్ర్యం పొందిందో అప్పటి నుండి ప్రపంచములోని లౌకిక దేశాల జబితాలో చోటుచేసుకుంది.

పురాతన నమ్మకాలు జానపద కథల రూపంలో ఉనికిలో ఉన్నాయి. కధల ప్రకారం మానవుల చేసిన పాపాలు ప్రకృతిలో ప్రతిధ్వనిస్తాయి. సరస్సులు ఉన్నట్లుండి మాయమవడం, అడవులు కనబడకుండా పోవడం, అక్కడున్న చెట్లు, మొక్కలు తమని పూజించమని అడగటం జరిగేవట.
తుహలా గ్రామములోని భౌతిక ప్రపంచం ఇటువంటి వివరణలు కోసం అభ్యర్థిస్తుంది. గ్రామం మొత్తం నేల చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది. 15 బూగర్భ నదులు చిట్టడవిలో పారుతున్న శబ్ధం ఎప్పుడూ వినబడుతునే ఉంటుంది. కానీ కళ్లకు కనిపించదు. ఈ రంద్రాలు ఒక్కొక్కసారి అతిపెద్దవై( ఒక గుర్రమును మింగగలిగేంత) వెంటనే కుచించుకుపోతాయి.

ఇలాంటి వింతలు కలిగిన గ్రామములో అతిముఖ్యమైన వింత ఈ మాంత్రీక బావి. వర్షాలు కురిసిన తరువాత భూగర్భనీరు ఒత్తిడి తట్టుకోలేక పైకి అలా పొంగుకు వస్తున్నాయి అని భూగర్భ శాస్త్రవేత్తలు(జియాలజిస్టులు....భూమి నిర్మాణము, మూలము, పదార్థ స్వభావము మొదలైన అంశాల శాస్త్రీయ అధ్యయనము చేసేవారు) చెబుతున్నారు.
"చుట్టూ ఎన్నో బావులు ఉండంగా, గ్రామం మొత్తం రంద్రాలు ఉండగా, ఎందుకని ఒక్క ఆ బావిలోనుండే నీరు ఉబికి వస్తున్నది. ఆ బావి లోతు 2.5 మీటర్లే ఉన్నది. భూగర్భ జలాలు(వర్షం కురిసినా ఇంకిపోయే) అంతలోతు మాత్రమే ఇంకుతాయా?.....కనీసం మాకు తెలిసి 500 సంవత్సరాల నుండి ఈ బావిని చూడటానికి ప్రజలు వస్తున్నారని మాకు తెలుసు. ఈ మాంత్రీక బావిలోనుండి వచ్చే నీటిని తాగితే జబ్బులను నయం చేస్తుంది. కచ్చితంగా 100 ఏళ్ళు బ్రతుకుతారు. శాస్త్రం ఈ మధ్య వచ్చింది. శాస్త్రవేత్తలు చెప్పేది నిజమనే అనుకుందాం...ఏది గ్రామము క్రింద పారుతున్న 15 నదులను చూపించమనండి" అంటూ జియాలజిస్టులు చెప్పేవాటిని అక్కడి ప్రజలు కొట్టిపారేస్తున్నారు.

"ఎక్కడైనా రోజా పువ్వులను ముక్కలు చేసి వేస్తే, అక్కడ రోజా చెట్లు మొలుస్తాయా?...ఇక్కడ మొలుస్తాయని/మొలిచేవని మా పూర్వీకులు చెప్పేవారు" అని మరొకరు అంటున్నారు.
ఒకప్పుడు ఆ బావి దగ్గర ప్రార్ధనలు చేసేవారు. నేల మీదున్న రంధ్రాల నుండి భూమాతకు తమ కష్టాలు చెప్పుకునేవారు. యుద్దలు మొదలై గ్రామాన్ని వివిధ రకాల ప్రజలు ఆక్రమించుకున్న తరువాత ఇక్కడున్న రంధ్రాలు మామూలు రంధ్రాలుగా, బావిని మామూలు బావిగా చూసేవారు. మళ్ళీ ఇప్పుడు అంటే 2008లో ఒక సారి, తిరిగి 2010 లో ఒకసారి ఆ బావిలో నుండి నీరు రావడంతో ఈ మాంత్రీక బావిని చూడటానికి పర్యాటకులు వస్తున్నారు.

ఈ గ్రామం క్రింద పారుతున్నాయని చెబుతున్న కనిపించని భూగర్భ నదులను సైన్స్ పరంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే మిగిలిపోతుంది.

No comments:

Post a Comment