Friday, September 2, 2016

ముత్యాల వంతెన...ఫోటోలు మరియు వివరాలు

జపాన్ దేశంలోని అకాసీ కైకో వంతెన ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెనలలో ఒకటి. ఈ బ్రహ్మాండమైన వంతెనకు ముత్యాల వంతెన అనే మరో పేరు కూడ ఉన్నది. జపాన్ దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన అకాసీ నగరాన్ని--- అవాజీ దీవిని కలపటానికి అకాసీ సముద్ర నీటి జలాలపై(Akashi Strait) ఈ వంతెనను నిర్మించేరు. కొన్ని సంవత్సరాల ప్రణాళిక తరువాత 1986, మే నెలలో నిర్మాణం మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్-5, 1998 లో వంతెన కట్టడం పూర్తిచేసారు. మొదట్లో రైల్వే లైన్ కూడా అమర్చాలనుకున్నారు. కానీ ఆ తరువాత ఆ ఉద్దేశం మానుకుని కార్లూ, బస్సులూ,లారీలు వెళ్ళడానికి మాత్రం ఆరు రోడ్లు(వెళ్ళడానికి మూడు, రావడానికి మూడు) ఉండేటట్లు వంతెనను నిర్మించేరు. పెను తుఫానలనూ, పెద్ద భూకంపాలనూ(రిచటర్ స్కేల్లో 8.5 వరకు నమొదయ్యే భూమి అదుర్లను)తట్టుకోగలిగే అతి గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీతో అకాసీ కైకో వంతెనను కట్టేరు.
1986 వ సంవత్సరం అకాసీ కైకో వంతెనను నిర్మాణిస్తున్నప్పుడు జనవరి-17, 1995 లో రిచటర్ స్కేల్లో 7.2 గా నమోదెైన భూకంపం ఏర్పడింది. ఆ భూకంప తాకిడిలో వంతెన నిర్మాణం ఎటువంటి నష్టానికీ గురికాకపోయినా వంతెన నిర్మాణం పొడవు ఒక మీటరుగా పెరగటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే మొదట్లో 1990 మీటర్ల దూరానికి సరిపడ వేసిన 2 వంతెన పిల్లర్లు అ భూకంపం తరువాత 1991 మీటర్లుగా జరిగినై.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేలాడే వంతెన (అకాసీ కైకో/ముత్యాల వంతెన) గురించిన ఆశ్చర్యపరిచే అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం.
1) వంతెన మొత్త పొడవు 3,911 మీటర్లు(12,831 అడుగులు). వంతెనకు ఊపిరిగా ఉండే రెండు పిల్లర్ల మధ్య దూరం 1,991 మీటర్లు (అంటే 1.24 మైళ్ళు).

2) వంతెన మధ్య వేయబడ్డ ఊపిరి పిల్లర్ల దూరంలో ఎక్కువ దూరం ఉన్న వంతెన ప్రపంచంలోనే ఇదొక్కటే.

3) 100 కు పైన వంతెనల నిర్మాణ కంపెనీలు కలిసి పనిచేసిన మొదటి వంతెన ఇదే. 20 లక్షల మంది కార్మీకులు కలిసి కట్టుగా పనిచేసిన మొదటి వంతెన కూడా ఇదే.

4) 286 కిలోమీటర్ల వేగమైన గాలిని, రిచటర్ స్కెల్లో 8.5 బలమైన భూకంపాన్ని తట్టుకోగలిగే శక్తి కలిగినది.

5) మొత్త వంతెనకు ఉపయోగించిన ఇనుము 1,81,000 టన్నులు. పిల్లర్లకు వాడబడిన సిమెంట్ కాంక్రీట్ 14 లక్షల క్యూబిక్ అడుగులుగా ఉంటుంది.

6) అత్యంత ఉష్ణోగ్రతలలో వంతెన 2 మీటర్లకు సాగుతుంది.
7) వంతెన సముద్ర మట్టానికి 65 మీటర్ల ఎత్తులో కట్టబడ్డది కాబట్టి పెద్ద ఓడలు కూడా వంతెన క్రింద నుండి వెళ్ళవచ్చు.

8) వంతెన మొత్త పొడవుకు ఉపయోగించబడ్డ మొత్త ఐరన్ కేబుల్స్ పొడవు 3,00,000 కిలోమీటర్లు(అంటే 1,90,000 మైళ్ళు). ఇందులోని ఒక్కొక్క కేబుల్ 44 ఇంచుల లావుగా ఉంటుంది.

9) పిల్లర్లలొ వేసిన ఇనుప చట్రాలు, ఇనుప పైపులను చుట్టడానికి 36,880 ఇనుప కేబుల్స్ ఉపయోగించేరు.

10) ఈ వంతెన మొత్తానికీ ఉపయోగించిన ఇనుప కేబుల్స్ ను లెక్క వేస్తే అది ప్రపంచ మొత్తాన్నీ 7 సార్లు చుట్ట వచ్చుట.
11) అంతర్జాతీయ నౌకా రవాణా దారి అయిన ఈ సముద్ర నీటి జలపాత దారిలో రోజుకు 1000 నౌకలు ప్రయాణం చేస్తాయట.

12) రోజుకు సరాసరి 23,000 వాహనాలు వెళ్ళే ఈ వంతెనకు రాత్రి పూట వెలుతురు కోసం 1,737 లైట్లు అమర్చేరు.

13) ఈ వంతెన కట్టటానికి అయిన మొత్త ఖర్చు 500 బిల్లియన్ అమెరికన్ డాలర్లు.

No comments:

Post a Comment