Monday, September 12, 2016

మరణం తరువాత జీవితం: దొరికింది మొదటి శాస్త్రీయ సాక్ష్యం....వివరాలు

ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అతి పెద్ద శాస్త్రీయ అధ్యయనంలో మరణం తరువాత జీవితం గురించిన మొదటి సూచన దొరికిందని చెబుతున్నారు. వైద్య మరణం తరువాత మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాలవరకు ప్రస్తుత జీవిత అవగాహనతో ఉంటాడు అనడానికి మొదటి సాక్ష్యం దొరికిందని వారు తెలియజేసేరు. గతంలో ఇది అసాధ్యం అని భావించారు.
మరణం అనేది బాధతో కూడిన జీవితం యొక్క అనివార్య పరిణామం. కానీ శాస్త్రవేత్తలు మరణం తరువాత జీవితం ఉన్నదని చెప్పటానికి కావలసిన సూచన దొరికిందని చెబుతున్నారు. అందువలన మరణం గురించిన బాధ అవసరంలేదని, ఎందుకంటే మరణం తరువాత ఇంకో జీవితానికి వెడతారనేది అర్ధంచేసుకోవాలని తెలుపుతున్నారు. ఒక వ్యక్తిలో మరణ సమీపం అప్పుడు మరియు మరణించిన తరువాత శరీరం వెలుపల ఏర్పడే అనుభవాల గురించి ఎప్పుడూ జరగనటువంటి అతిపెద్ద వైద్య అధ్యయనంలో వైద్య మరణం తరువాత మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాలవరకు ప్రస్తుత జీవిత అవగాహనతో, ప్రస్తుత లోకంలో ఉంటాడు అనే విషయాన్ని కనుగొన్నారు. ఈ మధ్య వరకు ఇది విస్తృత వివాదాస్పద విషయంగా ఉండటంతో దీనిని(మరణం తరువాత జీవితం) విశ్వాసము లేని విషయంగానే పరిగణించేరు.

కానీ సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గత నాలుగు సంవత్సరాలుగా హార్ట్ అటాక్ తో బాధపడుతున్న 2000 మంది రోగులను అమెరికా, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రియా దేశాల 15 ఆసుపత్రులలో అధ్యయనం చేసేరు. ఇందులో 40 శాతం మంది వైద్య పరంగా చనిపోయి డాక్టర్లచే తంతు వికంపనము మరియు ఒత్తిడి వైద్యము (కార్డియోపల్మనరీ రిసపిటేషన్) తో బ్రతికి బట్టకట్టేరు. అందులో ఒక రోగి తాను తన శరీరం నుండి పూర్తిగా వెళ్ళిపోయి ఆసుపత్రి రూము చివరలో నిలబడి తన గుండెను డాక్టర్లు కార్డియోపల్మనరీ రిసపిటేషన్ చేస్తున్నదానిని చూసినట్లు గుర్తుచేసుకున్నాడు.
స్మృతి తప్పిన మరియు 3 నిమిషాలు చనిపోయిన 57 సంవత్సరాల సామాజిక కార్యకర్త అయిన ఇతను డాక్టర్లు /నర్సులు అతనిపై చేసిన చర్యలను వివరముగా వివరించేడు. వారు వాడిన యంత్రాల యొక్క ధ్వనిని కూడా వివరించాడు.

"హృదయము కొట్టుకోవడం మానేసిన తరువాత మెదడు పనిచేయదని మాకు తెలుసు" సౌత్ ఆంప్టన్ మాజీ పరిశోధన శాస్త్రవేత్త, ప్రస్తుత న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగానూ, ఈ అతి పెద్ద శాస్త్రీయ అధ్యయన జట్టు యొక్క నాయకుడైన డాక్టర్ స్యామ్ పార్నియా అన్నారు. (డాక్టర్.స్యామ్ పార్నియా చనిపోయిన వారిని కార్డియోపల్మనరీ రిసపిటేషన్ తో కొద్దిసేపట్లో బ్రతికించగలరు అనే పేరుతెచ్చుకున్న డాక్టర్). ఈయన, పునరుజ్జీవన పరికరాల ఉపయోగ పరిశోధనలో అత్యంత గొప్ప పురోగతి సాధించిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందేరు. ఈయన సాధించిన పరికరాల ఉపయోగ పరిశోధన మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో హార్ట్ అటాక్ రోగులు మరణం నుంచి తప్పించుకున్నారు.

డాక్టర్ స్యామ్ పార్నియా
"కానీ ఈ ప్రత్యేక ఉదాహరణలో, గుండె ఆగిపోయిన మూడు నిమిషాల వరకు సృహతో కూడిన అవగాహన కొనసాగిందని తెలుస్తోంది. ఎందుకంటే మామూలుగా గుండె ఆగిపోయిన 20-30 క్షణాలలో మెదడు పనిచేయడం మానేస్తుంది"

“ఈ రోగి రూములో తన మీద జరిగిన ప్రయత్నాలన్నింటినీ పూర్తిగా వివరించేడు. అందులోనూ ముఖ్యంగా ఒక యంత్రములో నుండి 3 నిమిషాలకు ఒకసారి మాత్రమే వచ్చే "బీప్" శబ్దాన్ని అతను వివరించేడు”

“అతను చెప్పేది చాలా నమ్మదగినదిగానే ఉన్నది. అతను చెప్పినవన్నీ అతని మీద ఉపయోగించబడ్డాయి”

ఇతని వివరణను పక్కన పెడితే 40 శాతములో మిగిలిన వారు పునరుత్థానం చేయబడుతున్నప్పుడు ఏదో ఒక అవగాహన అనుభవించినట్లు తెలిపేరు. చాలా మంది తమ అనుభవాలను స్పష్టంగా తెలియజేయలేకపోయినా వారి వివరణలో నేపథ్యాలు ఉద్భవించేయి. అసాధారణ ప్రశాంతతను అనుభవించేమని కొందరు చెప్పగా, మరికొందరు సమయం అయిపోవడం లేక పెరగడం జరిగిందని తెలిపేరు.
కొందరు ప్రకాశవంతమైన కాంతిని చూసేమని, కొందరు బంగారు మెఱపును చూసేమని, మరికొందరు సూర్యుని వెలుతురు చూసేమని తెలిపేరు. కొంతమంది భయం వేసిందని, నీటిలో మునిగిపోతున్న అనుభవం కలిగిందని, నీటిలో నుండి ఎవరో పైకి లాగుతున్న అనుభూతి కలిగిందని తెలిపేరు.

13 శాతం మంది తమ శరీరం నుండి విడిపోతున్నట్లు, కొంతమంది పైకి వెడుతున్నట్లు అనిపించిందని తెలిపేరు.

"మిగిలిన వారు కూడా ఏదో ఒక అవగాహన కలిగి ఉంటారు. కాకపోతే వైద్యం కోసం డాక్టర్లు ఇచ్చిన మత్తు మందు మరియు ఇతర మందులవలన పునరుత్థానం చేసేటప్పుడు అనుభవించిన అనుభూతులను వారు మరిచిపోయి ఉంటారు” అని డాక్టర్ పర్నియా నమ్ముతున్నారు.
లక్షలాది మంది మరణం సంబంధించిన స్పష్టమైన అనుభవాలు అనుభవించి ఉంటారని అంచనాలు సూచిస్తున్నా శాస్త్రీయ ఆధారం సందిగ్ధంలోనే ఉంటోంది.

ఈ అనుభవాలను న్యాయపరచటానికి మరికొన్ని పరిశోధనలు అవసరం.

నాటింగ్ హాం ట్రెంట్ విశ్వవిద్యాలయ మనస్తత్వవేత్త డాక్టర్. డేవిడ్ విల్డే ప్రస్తుతం శరీరం వెలుపల జరిగినట్లు చెప్పినటువంటి పరిమాణాలను అనుసంధానం చేస్తూ మరణం తరువాత జీవితం గురించిన అనుభవాలలో ఒక దానితో మరొకదానిని పోల్చే నమూనా తయారుచేస్తున్నారు. ఈ వివాదాస్పదమైన విషయము గురించి మరికొన్ని పరిశోధనలు జరపటానికి ఇది ప్రోత్సహిస్తుందని ఆయన చెబుతున్నారు.

1 comment:



  1. మరణము తరువాయి మనుజు
    డు రణగొణల నడుమ పూర్వపు మతిని గొనియుం
    డు, రుజువులగు పించెనుగా !
    మరు జన్మ రహస్యములిక మన్నిక గనునూ !

    జిలేబి

    ReplyDelete