Friday, September 2, 2016

మిస్టరీ:."ఎగిరే మనిషి:...కొలుస్తున్న ప్రజలు"....ఫోటోలు మరియు వివరాలు

నవంబర్-15,1966 నుండి డిసెంబర్-15, 1967 వరకు అమెరికా రాష్ట్రమైన దక్షిణ విర్జీనియాలోని పాయింట్ ప్లజంట్ అనే గ్రామములో వింత ఆకారమున్న/ భయంకరమైన ఒక ఎగిరే మనిషిని ఆ గ్రామములోని పలువురు చూసేరు/ ఎదుర్కొన్నారు. అలా చాలా సార్లు జరింగింది. బ్రహ్మాండమైన ఎత్తున్న ఆ ఎగిరే మనిషికి అతిపెద్ద రెక్కలు, ఎర్రటి కళ్ళు ఉన్నాయట. ఆ ఎగిరే మనిషి మన భూలోకానికి చెందిన వాడు కాదని గట్టిగా నమ్మేరు. ఆ ఎగిరే మనిషి ఎక్కడ నుండి వచ్చేడు, దేనికోసం వచ్చేడు, ఎక్కడికి వెళ్ళేడు అనేది మాత్రం ఈ నాటికి చర్చనీయాంశంగానే ఉన్నది.
ఒక్కటి మాత్రం నిజం. ఆ భయంకరమైన ఎగిరే మనిషి పాయింట్ ప్లజంట్ లో నివసిస్తున్నవారి మదిలో శాశ్వత గుర్తుగా ఉండిపోయింది. ఆ ఎగిరే మనిషి యొక్క భయానకమైన వీక్షణల ప్రభావం ఇప్పటికీ వారిని వెన్నంటుతూనే ఉన్నది. ఆరోజుల్లో(1966-1967) ఆ ఎగిరే మనిషిని కొలవడం, పండుగ చేసుకోవడం నుండి ఈ రోజు పాయింట్ ప్లజంట్ టౌను మధ్యలో ఆ ఎగిరే మనిషి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసి దానిని ఆరాధిస్తున్నరంటే ఆ ఎగిరే మనిషి ప్రభావం ఇప్పటికీ వారిలో ఎలా నిలిచిపోయిందో మనం గ్రహించవచ్చు.

1966 లో మొదటిసారి ఆ ఎగిరే మనిషి కనబడ్డప్పటి నుండి, ఆ ఎగిరే మనిషి కధ అక్కడ నివసిస్తున్న ప్రజలలో గుర్తింపు ముక్కగా ఉండిపోయింది. చాలామంది ప్రజలలో ఆ ఎగిరే మనిషి గురించిన మర్మం తెలుసుకోలేకపోయేమే అనేదే ఎక్కువగా బాధపెట్టింది.

నవంబర్ -12,1966లో పాయింట్ ప్లజంట్ గ్రామానికి చెందిన 5 గురు వ్యక్తులు ఊరి చివర ఉన్న స్మశానంలో సమాధికోసం తవ్వకం ప్రారంభించినప్పుడు మనిషి రూపం గల ఒక ఆకారం అక్కడున్న చెట్లపై నుండి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ వారిని పలుసార్లు చుట్టి వెళ్ళిందని వారు ఆ గ్రామ పెద్దకు తెలిపేరు. అందువలన కలిగిన భయంతో సమాధి తవ్వకం సగంలోనే ఆగిపోయిందని తెలిపేరు. అప్పుడే ఆ ఆకారానికి మోత్మన్(Mothman)అని నామకరణం చెయబడింది.

(ఎగిరే మనిషి ఊహాచిత్రం)
3 రోజుల తరువాత నవంబర్-15, 1966 లో అదే గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు(Roger and Linda Scarberry, Steve and Mary Mallette) ఊరిచివర ఎగురుతున్న ఒక మనిషిని చూసేమని, అతని రూపం బ్రహ్మాండంగానూ, భయంకరంగానూ ఉన్నదని, ఆ ఎగిరే మనిషికి కనీసం 10 అడుగుల పొడవున్న రెక్కలు, అగ్ని గుండం లాంటి ఎర్రని కళ్ళు ఉన్నాయని, తమ కారును వెంబడిస్తూ వచ్చిందని, గ్రామం లోపలకు వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిందని, తమకి చాలా భయంగా ఉన్నదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తమకి రక్షణ ఇవ్వవలసినదిగా పోలీసులను కోరేరు. "ఎక్కడి నుండి ఆ ఆకారం మిమ్మల్ని తరుముకు వచ్చింది" అని పోలీసులు ఆ దంపతులను అడిగినప్పుడు “ఊరి బయట ఉన్న టి.ఏన్.టి (రెండవ ప్రపచ యుద్ద సమయంలో ఇక్కడ ఆయుధాలను నిలువచేసే గిడ్డంగులు ఉండేవి) ప్రాంతం నుండి” అని జవాబు ఇచ్చేరు.

Point Pleasant Register అనే వార్తా పత్రిక నవంబర్-16, 1966 న ఈ వార్తను తమ వార్తాపత్రిక హెడ్ లైన్లలో ప్రచురించింది.
ఆ తరువాత ఆ భయంకరమైన ఎగిరే మనిషిని ఊరిచివర చూసేమని చాలామంది తెలిపేరు.

ఆ తరువాత చివరి సారిగా ఆ ఎగిరే మనిషిని డిసెంబర్-15, 1967లో చూసేరు. కొంతమంది అప్పుడు ఆ ఎగిరే మనిషి పాయింట్ ప్లజంట్ గ్రామములో ఉన్న సిల్వర్ వంతెన పైన కూర్చున్నట్టు చూసేరట. కొద్ది క్షణాలలో ఆ వంతెన కూలిపోయింది. 46 మందికిపైగా చనిపోయేరు. ఈ సంఘటన పురాణమయ్యింది. ఆ ఎగిరే మనిషికీ, వంతెన కూలిపోవడానికి సంబంధం ఉన్నట్టు మాట్లాడుకున్నారు.
రెండవ ప్రపంచ యుద్ద ఆయుధ గిడ్డంగి టి.ఎన్.టి, ఆ ఎగిరే మనిషి నివాశమని తేల్చి చెప్పేరు. అటువైపు ఎవరూ వెళ్ళలేదు. ఆ తరువాత ఎవరికీ ఆ ఎగిరే మనిషి కనబడలేదు.
ఆ ఎగిరే మనిషి జరగబోయే చెడు సంఘటనలను ముందే చెప్పటానికి వచ్చిందని చాలామంది పుస్తకాలలో రాయడంతో పాయింట్ ప్లజంట్ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం నవంబర్ -డిసెంబర్ నెలలో ఆ ఎగిరే మనిషికి పూజలు చేస్తూ వచ్చేరు. సంవత్సరాల తరబడి జరుపుతున్న ఆ పూజలకు 2002 లో Bob Roach అనే ఒక శిల్పి 12 అడుగుల ఎగిరే మనిషి విగ్రహాన్ని ఉక్కుతో చెక్కి గ్రామ నడిబొడ్డులో స్థాపించి విషయాన్ని బహిరంగ పరచేడు. అప్పటి నుండి మోత్మన్ పండుగను బహిరంగంగానే జరపటం మొదలు పెట్టేరు. ఎగిరే మనిషి విగ్రహాన్ని, చరిత్రను తెలుసుకోవటానికి మోత్మన్ పండుగను చూడటానికి పర్యాటకులు రావడం మొదలుపెట్టేరు. వచ్చిన పర్యాటకులు పండుగలో భాగంగా టి.ఎన్.టి ఆయుధ గిడ్డంగులను కూడా చూసి వెడుతున్నారు.

ఎగిరే మనిషి మ్యూజియం
మ్యూజియం అంటేనే రుజువులకోసమని మనందరికీ తెలుసు. పాయింట్ ప్లజంట్ గ్రామములో ఎగిరే మనిషి యొక్క విగ్రహానికి ఎదురుగా ఊంటుంది ఈ మ్యూజియం. ఇందులో ఎగిరే మనిషికి సంబంధించిన ఆ నాటి తాలూకా రుజువులు ఉంచేరు.

ఎగిరే మనిషి పండుగ
ప్రతి సంవత్సరం ఈ పండుగను నవంబర్- డిసెంబర్ నెలలలో జరుపుకుంటారు. వివిధ దేశాల నుండి పర్యాటకులు వస్తారు.

No comments:

Post a Comment