Thursday, September 15, 2016

ఆయువు పెంచే "మూలకణాలు: అనారోగ్యానికి స్టెమ్సెల్స్ తో చెక్....ఫోటోలు మరియు వివరాలు

స్టెమ్సెల్స్=మూలకణాలు

పాడైపోయిన(వ్యాధికి గురైన మరియు బాగుచేయలేని )అవయవాలతో భాధ పడే వారిని , అవయవ మార్పిడివలన మాత్రమే బ్రతికించగలమని వైద్య శాస్త్రం ప్రచారం చేస్తున్నప్పటి నుండి అవయవ దానాలు చేసే వారి సంఖ్య కనీసంగా పెరిగిందనేది నిజం. అవయవ దానాలిచ్చిన వారి అవయవాలను అమర్చుకుని చావు నుంచి బయటపడి ఆనందంగా జీవితం కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు.
అలాగే మూలకణాలతో అనారోగ్యానికి చెక్ పెట్టవచ్చునని వైద్య శాస్త్రం తెలియజేయడంతో మూలకణాలను బద్రపరిచుకునే వారి సంఖ్య మరియు దానం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అవయవ మార్పిడి కంటే మూలకణాలతో చేసే వైద్యమే కచ్చితమైన విజయాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేయడంతో మూలకణాలు బద్రపరచే బ్యాంకులు కూడా ఎక్కువవుతున్నాయి.

మానవ శరీరం కణాల నిర్మితం. కణాలతో ఏర్పడిన కణజాలం వివిధ శరీర అవయావాలుగా రూపాంతరం చెందుతుంది. అయితే శరీర కణాలన్నీ మూల కణాలు కావు. రెండు నిర్ధిష్ట లక్షణాలున్న జీవ కణాలను మాత్రమే మూల కణాలంటారు. వీటికి ఉన్న విశిష్టత ఎమిటంటే శరీరంలోని వేర్వేరు కణాలుగా (చర్మ, ఎముక, కండరం తదితరాలు...) మారగల సామర్థ్యం ఈ కణాలకు ఉంటుంది. సమస్యాత్మక కణం అవయవాలుగా, కణజాలాల అభివృద్ధికి మూలం ఈ మూలకణాలు. అసాధరణ పరిస్థితుల్లో లేదా ఏదైనా అవయవం లేదా కణజాలం పని చేయని స్థితి ఏర్పడినప్పుడు మూలకణాలు ఆయా రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అవయవాన్ని పూర్తిగా తయారు చేస్తాయి.
కాన్పు తరువాత గర్భాశయ ద్రవంలో, బొడ్డుతాడును అంటి పెట్టుకుని ఉండే రక్తంలో బిడ్డ తాలూకూ మూలకణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బొడ్డు తాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. బొడ్డుతాడు రక్తంలో మూలకణాలు (హెమటోపాయనిక్ సెల్స్) చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని రక్త, జన్యు సంబంధ వాధ్యులు చికిత్సకు ఉపయోగించవచ్చు. బొడ్డు తాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. ప్రసవం జరిగిన ఆరు గంటల లోపు బొడ్డు తాడును, రక్తాన్నిసేకరిస్తే అందులో 98శాతం మూలకణాలు లభిస్తాయి.
చాలా సందర్భాల్లో బిడ్డ్ పుట్టిన వెంటనే రెండో ఆలోచనకు తావు లేకుండా బొడ్డుతాడును, రక్తాన్ని పారవేస్తారు. ఎంతో అమూల్యమైన మూలకణాలు ఉన్న రక్తాన్ని వృద్ధా చేస్తుంటారు. మూలకణాలపై ఎన్నో పరిశోధనలు జరిగిన తరువాత శరీరభాగాలను ఉత్పత్తి చేసే శక్తి వీటికి ఉందని గుర్తించారు. బొడ్డుతాడును, అందులోని రక్తాన్ని ఎముక మూలగ (బోన్మేరో) మాదిరిగానే సేకరించి నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఇలా సేకరించిన బొడ్డుతాడును, రక్తాన్ని -196 డిగ్రీల వద్ద లిక్విడ్ నెట్రోజన్ ట్యాంక్ లో నిల్వచేస్తారు. ఇలా మూలకణాలను నిల్వ చేసి విప్లవాత్మక పద్ధతే మూల కణాల బ్యాంకింగ్. మూలకణాలను నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో బిడ్డకు రాగల వ్యాధులకు చికిత్స, అవసరమైతే శరీరావయవాలను పరిశోధన శాలల్లో ఉత్పత్తి చేసేలా వీలు కలుగుతుంది.

మూలకణాలతో చికిత్స చేయగల వ్యాధులు: లుకేమియా తోపాటు కొన్ని ఇతర రకాల క్యాన్సర్లు, గుండెకు సంబంధిత వ్యాధులు, మంటింగ్టన్ వ్యాధి వంటి మెటబాలిక్ స్టోరేజ్ వ్యాధులు. అవయవ, కణజాల పునర్నిర్మాణం.. రీ జనరేటివ్ మెడిసిన్లో కొత్త కణజాలాలను నిర్మించేందుకు మూలకణాలను ఉపయోగిస్తున్నారు.కిలో బరువు ఉన్న శరీరఅవయవం రూపొందడానికి ఒక్క మిలియన్ మూలకణాలు అవసరం అవుతాయి. వీటిని పరిశోధనాలయాల్లో తయారు చేస్తారు. చాలా సందర్భాల్లో రోగికి సరిపోయే రక్త కణాలను గుర్తించేలోపు ప్రాణాల మీదకు వస్తూంటుంది. ఇలాంటి సందర్భాల్లో మూలకణాలు ద్వారా చికిత్స అనేది చాలా సులభం.
కాలుష్యమయమైన వాతావరణం, క్రమం తప్పిన ఆహారపు అలవాట్లు, అనారోగ్యసమస్యలకు కారణం అవుతున్న జీవన విధానం అన్నీ కలిపి కొత్తకొత్త రోగాలు,అకాల మరణాలు...వీటన్నీంటీకి వైద్యనిపుణులు ప్రత్యామ్నాయ వైద్యచికిత్సవిధానాలను పరిశోధిస్తున్నారు.

1960 లలో ఎర్నెస్ట్ ఎ. మక్కల్లో, మరియు జేమ్స్ ఇ. టిల్ అనబడే కెనేడియన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల మూలంగా మూల కణాల రంగం ఎంతో పురోగమించింది. జపాన్ శాస్త్రవేత్త షినియా యమనాక, బ్రిటన్ శాస్త్రవేత్త జాన్ గురుడాన్ మూల కణాల పరిశోధనలో 2012 సంవత్సరం వైద్యరంగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఎన్నో పరిశోధనలకు ఆస్కారం కలిపిస్తూ భవిష్యత్ అనారోగ్యాలకు చెక్ చెప్పేలా మూలకణాల నిల్వ అనేది కొనసాగుతున్నది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక్క మూలకణాల నిధి ప్రజలకు అందుబాటులో ఉంది.
మానవ శరీరావయాలను తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇతరుల నుంచి సేకరించడం, లేదా మూలకణాల నుంచి ఉత్పత్తి చేయడం మాత్రమే ప్రాణాంతక వ్యాధులకు చికిత్సగా గుర్తించారు. మరి శరీరావయవాలను దానం చేయాలన్న ఆలోచన ఎంతో ఉన్నతాశయాలు ఉన్నవారిలోనే కలిగే ఆలోచన...మరి అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు కాబట్టే కిడ్ని, లివర్, గుండె, ఊపిరితిత్తులు మార్పిడిల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ఇక మిగిలిన ఆలోచన మూలకణాల నుంచి శరీరావయవాలను ఉత్పత్తి చేయడం. అయితే ఇందుకు మూల కణాలు కావాలి. నిర్ధిష్ట లక్షణాలున్న జీవకణాలను పరిశోధన శాలలో శరీరావయావాలుగా మార్చవచ్చు. విదేశాల్లో బహు ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ విధానం ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ అందుబాటులోకి వస్తొంది.
గర్భం దాల్చిన స్త్రీలలో 13-28 వారాలలో పిండం ఎదుగుదల ఏర్పడుతుంది. అప్పుడు గర్భములోని ఉమ్మనీరు లో ఈ మూలకణాలు బలంగా ఉంటాయని ఈ మధ్య తెలుసుకున్నారు. అందువలన 13-28 వారాలలో గర్భములోని ఉమ్మునీరును కొంచముగా తీసి బద్రపరచుకుంటే ఆ తరువాత అది పుట్టే బిడ్డకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. పుట్టిన బిడ్డకే కాకుండా వారి దగ్గర బంధువులకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎదుగుతున్న పిండంలోని మూల కణాలు, అన్ని రకాల ప్రత్యేక పిండ ధాతువులుగాను విభేదన చెందగలవు. ఎదిగిన జీవాలలో, మూల కణాలు మరియు పూర్వ కణాలు, దేహం ధాతువుల్లో దోషాలని చక్కదిద్దడం, నాశనం అయిపోయిన ప్రత్యేక కణాలని తిరిగి భర్తీ చెయ్యడం వంటి పనులు చేస్తుంటాయి. ఇవి కాక పునరుజ్జీవితం కాగల అవయవాలలో చచ్చిపోయిన ధాతువు స్థానంలో కొత్త ధాతువు వచ్చే సహజ ప్రక్రియలో కూడా ఈ ఎదిగిన మూలకణాలు పాత్ర వహిస్తాయి.

No comments:

Post a Comment