Sunday, September 11, 2016

పొడవైన వ్రేలాడే వంతెన....ఫోటోలు

పలు కొండలను కలుపుతూ 650 అడుగుల ఎత్తులో, 1800 అడుగుల పొడవుకు వేయబడిన ఈ వ్రేలాడే (సస్పెన్షన్)వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన వ్రేలాడే వంతెన. ఇది రష్యా దేశంలోని సొచి నేషనల్ పార్క్ లో నిర్మంచబడింది. పర్యాటకులకు కొండలను, కొండ క్రింద ఉండే లోయలను, రహదారులను, జంతువులను ఉత్కంఠభరితమైన దృశ్యాలతో చూపించడానికొసం . నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టిందట.

740 టన్నుల ఉక్కు, 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించి కట్టిన ఈ వంతెన పై ఒకేసారి 3000 మంది నిలబడవచ్చు. ఈ వంతెన రిచ్టర్ స్కెల్లో 9 పరిమాణం గల భూకంపాలను కూడా తట్టుకునేటట్టు కట్టేరు.

No comments:

Post a Comment