Saturday, September 10, 2016

పై నుండి ఇస్తాంబుల్ అందాలు....ఫోటోలు

ఇస్తాంబుల్ యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు వున్నాయి. టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను, మరియు 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని"గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించ బడ్డాయి.

1 comment:



  1. పైనుండిస్తాంబుల్ విం
    తైనన గరమౌ జిలేబి తైజస మనగన్
    వాణిజ్యకేంద్రముగనూ
    ఈనగ రమ్మీస్టువెస్టు లీడేర్చుసుమీ !

    జిలేబి

    ReplyDelete