Sunday, September 4, 2016

10 లక్షల బంగారు పూత కంచు విగ్రహాలతో అమర్చబడిన బౌద్ధ దేవాలయం...ఫోటోలు, వివరాలు

“వాట్ ఫ్రా దమకయా” అని పిలువబడే ఈ భారీ బౌద్ధ దేవాలయం, తాయ్లాండ్ దేశములోని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండలములో ఉన్నది. 1970 లో బౌద్ద మతంలోని ఒక వర్గం వారు మొదలుపెట్టిన వివాదాస్పదమైన "మోక్షం" అనే ఉద్యమానికి ఇది కేంద్రం. సంప్రదాయ ప్రకారం కాకుండా వ్యాపారీకరణ ఉద్దేశముతో బౌద్ద మత ప్రచారం చేస్తున్నారని వీరి మీద విరుచుకుపడ్డారు.ఆచారాలే పాటించకుండా ఒక బిల్లియన్ డాలర్ల ఖర్చుతో మత గుఱుతులతో ఒక అంతరిక్ష నౌకలాగా, ఒక క్రీడాస్థలములాగా ఇంకా చెప్పాలంటే ఒక యు.ఎఫ్.ఓ లాగా ఈ దేవాలయమును కట్టేరు. మామూలుగా తాయ్లండ్ లోని దేవాలయలలాగా ఇది ఒక దేవాలయంగా కట్టలేదు. కనుక ఇది అసలు ఒక బౌద్ద దేవాలయమే కాదని వ్యాపారం కోసం, డబ్బు కోసం ఈ దేవాలయం కట్టేరుగానీ భక్తితో కాదని వాదించేరు. మోక్షం పేరున ప్రజలను మోసం చేయాలని ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని వీరిపై నిందలు ఉన్నాయి.
ఈ దేవాలయ భవనములో మధ్య భాగములో ఒక అతిపెద్ద గుండ్రని ఆకార గోపురం కట్టేరు. దీనినే మోక్ష ప్రదేశం అని చెబుతున్నారు. ఆ గుండ్రని గోపురం చుట్టూ బయట 3 లక్షల బంగారు పూత పూసిన కంచు బుద్దుని విగ్రహాలు, లోపల 7 లక్షల విగ్రహాలు అమర్చేరు. ఆ గుండ్రని గోపురం ఆ బౌత్తమత వర్గ గురువుగారి స్మారక చిహ్న మందిరం. ఈ గోపురాన్ని చుట్టూ బ్రహ్మాండమైన గుండ్రని కాంక్రీటు వేదిక అమర్చేరు. అక్కడ కూర్చుని ధ్యానం చేయవచ్చు. వెయ్యి ఎకరాల స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించేరు.
ఇక్కడ ప్రతిరోజూ సమూహంగా ప్రార్ధనలూ మరియూ ధ్యానాలు జరుగుతాయి. స్వచ్చంద సేవకులు దీనికి సహాయపడతారు. ఆదివారాలూ మరియూ బౌద్ద మత పండుగలప్పుడూ ఒక లక్ష మంది భక్తులు ఇక్కడ సమావేశమౌతారు. వీరు కాక అక్కడ 3000 మంది మత సన్యాసులూ, పనివారు,ఆరంభకులు నివసిస్తారు. తాయ్ లాండ్ లో ఎక్కువ భక్తులు వచ్చే దేవాలయంగా ఇది ప్రసిద్ది చెందింది.
విపరీత వేడుకలూ మరియూ జాతీయ టెలివిజన్ కవరేజ్ ఉన్నప్పటికీ, ఈ దేవాలయమును అంతర్జాతీయ టెలివిజన్ రాడార్లు బయటి ప్రపంచానికి ఈ దేవాలయం గురించి తెలియనీయకుండా చూసుకున్నాయి. 40 సంవత్సరాలుగా ఉంటున్న ఈ బౌద్దమత వర్గం మరియూ ఈ దేవాలయం గురించి 2010లో బయట ప్రపంచానికి తెలిసింది. అదికూడా డిసెంబర్-25, 2010 న రెండువారాలకు వారు నిర్వహించిన వేడుక, జాతర మూలంగా ఇది ప్రపంచ ద్రుష్టికి తీసుకురాబడింది. ఆ వేడుక,జాతరలో సుమారు 2 లక్షల మంది పాల్గొన్నారు.
ఈ దేవాలయాన్ని కట్టిన తీరు, అందులో అమర్చిన బ్రహ్మాండమైన ధ్యాన వేదిక మరియూ 10 లక్షల విగ్రహ అమర్పులూ ఈ దేవాలయాన్ని ఒక ఇంజనీరింగ్ వండర్ గా వర్ణించేరు.

No comments:

Post a Comment