Wednesday, September 28, 2016

రైన్ బో కొండలు, చైనా...ఫోటోలు


మర్మమైన సముద్రతీర నిర్మాణాలు...ఫోటోలు

సముద్రతీరాలను సముద్రములే ఏర్పాటు చేసుకుంటాయి. మామూలుగా సముద్రతీరాలు నిటారుగా ఉండటం అందరమూ చూసే ఉంటాము. సముద్రతీరాలను అందంగానో లేక విచిత్రంగానో ఉండేటట్లు మానవుడు ఏర్పాటు చేసుకోలేడు. ఒకవేల అలా కావాలని ఏర్పరచుకున్నా సముద్రం ఆ ఏర్పాట్లను ఆదరించదు. కానీ కొన్ని చోట్ల సముద్రమే తన తీర నిర్మాణాలను వింతగా అమర్చుకున్నది. చూడటానికి వింతగాను, అద్భుతంగానూ ఉన్నటువంటి ఈ నిర్మాణాలను మానవులు మార్చుదామనుకున్నా, మళ్ళీ తనకు కావలసిన నిర్మాణంలోనే తీరాన్నీ అమర్చు కుంటోంది.

ఆలా ఎందుకు జరుగుతోందో ఎన్ని పరిశోధనలు చేసినా శాస్త్రవేత్తలకు కారణాలు తెలియటంలేదు. అలాంటి కొన్ని సముద్ర తీరాలను మనం ఇక్కడ చూద్దాము.

Jurassic Coast. Doarset, England.
Palomarin Beach, Point Reyes, USA.
Shumagin Islands, Alaska, USA.
Palomarin Beach, California, USA
Pearl Beach, NSW, Sydney, Australia.
Sandy Beach, Mexico.

Tuesday, September 27, 2016

చలనం లో చూపబడిన కొన్ని అద్భుత స్థిర చిత్రాలు....ఫోటోలు


భవనంలో నుండి వెడుతున్న జాతీయ రహదారి...ఫోటోలు(మరోసారి మీకొసం)

మీరు చూస్తున్న రహదారి జపాన్ దేశము లోని ఒక జాతీయ రహదారి. 1983 లో ఈ రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రహదారి వేయడానికి రహదారి మధ్యలో కొంత చోటు ఒక ప్రైవేట్ యజమానికిచెందింది. యజమాని రహదారికి తన చోటును ఇవ్వనని చెప్పడంతో ప్రభుత్వం కోర్టుకు వెల్లింది. యజమాని ఇస్తేనే ప్రభుత్వం ఆ చోటును ఉపయోగించుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. నగర అభివ్రుద్దిని ఆపకూడదని, ఆ యజమాని తాను కట్టబోయే 16 అంతస్తుల భనంలో 3 అంతస్తులు ప్రభుత్వ రహదారికి ఇస్తానని చెప్పడంతో ఆ రహదారి అలా ఏర్పడింది.

ప్రాణమున్న విగ్రహాలు....ఫోటోలు

అర్జంటీనా రాజధాని నగరమైన బ్యూనస్‌ ఎయిర్స్‌ లో జరిగిన "ప్రాణమున్న మానవ విగ్రహాలు" పోటీలో పాల్గొన్న కళాకారులు.