Wednesday, August 3, 2016

అంతర్యుద్దానికి ముందు సిరియా అందాలు....ఫోటోలు

అంతర్యుద్ధంతో సిరియా మండిపోతోంది...బాత్‌ ప్రభుత్వ దళాలు., ఫ్రీ సిరియన్‌ ఆర్మీ మధ్య సాగుతున్న పోరు చల్లారేలా కనిపించట్లేదు. అల్‌ అసద్‌ గద్దె దిగాలంటూ మొదలైన ఆందోళనల్లో వేలాది అమాయలకు పిట్టల్లా రాలిపోతున్నారు. అరబ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన స్వతంత్ర ఉద్యమాల బాటలో 2011 మార్చి 15న మొదలైన ఆందోళనలు ఏకథాటిగా కొనసాగుతున్నాయి. సిరియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. మరో వైపు ఆందోళనకారులకు టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్‌, అమెరికా, ఇంగ్లాంగ్‌, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లు మద్దతుగా నిలిస్తే బాత్‌ పార్టీ ప్రభుత్వానికి ఇరాన్‌, రష్యాలు బాసటగా నిలిచాయి. మూడున్నర లక్షల సైన్యమున్న సిరియన్‌ ప్రభుత్వ దళాలతో లక్షలోపు బలమున్న తిరుగుబాటుదారులు, ముజాహిదీన్లు తలపడుతున్నారు. ఆందోళనలు, నిరసనలతో సంబంధం లేని అమాయకులు కూడా మిలిషియా దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఒకప్పుడు అందాలతో మెరిసిపోయిన సిరియా ఈ రోజు పూర్తిగా ద్వoసం అయిపోయింది.


No comments:

Post a Comment