Saturday, August 13, 2016

మిస్టరీ: కదులుతున్న ఇసుకమేట....ఫోటోలు మరియు వివరాలు

ప్రకృతి అందాలకే అందం. ప్రశాంత వాతావరణం, పచ్చని తోటలు, కళ్ళు చల్లబడే వాతావరణం ప్రజలను ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, సవ్వడి చేసే జలపాతాలు, బిరిబిరా పారే సెలయేళ్ళు.... ఎన్నెన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలు కవి కాని వాడికి కూడా కవిత్వం తన్నుకొచ్చేటట్లు చేస్తుంది.
మనకు అవసరమైనవెన్నో ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతి యొక్క ప్రశాంతతను, మహోన్నతమైన స్వరూపాన్ని అనుభవించడానికి, మన జీవితాలను కొనసాగించాడానికి ప్రకృతి కల్పిస్తున్న అవకాశాలను అన్వేషించడానికి మనకు ఎన్ని అవకాశాలు లభిస్తున్నా ప్రకృతి గురించి తెలుసుకోవడానికి మానవ మెదడు ఎంత మాత్రం సరిపోదన్నది ఎవరైనా అంగీకరించవలసిన విషయమే.

ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు, విశేషాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.....ప్రపంచంలో తొలినుంచి అనేక విషయాలు ఎంతో నిగూఢమైనవిగా కనిపిస్తుంటాయి. అవి ప్రకృతికి సంబంధించినవి అయినప్పుడు మనలను ఆశ్చర్యచకితులను చేస్తాయి. అవి ఎలా నిర్మాణమయ్యేయో వివరించడం సాధ్యం కాదు. ఇవి ఊహలకు ఎంతమాత్రం అందవు. ఎన్ని రకాలుగా ఆలోచించినా సరైన సమాధానం లభించదు. మనిషి మేధస్సుకు అర్థం కాని చిక్కుముడులు అవి. అలాంటి కొన్ని విశేషాలలో ఈ కదులుతున్న ఇసుకమేట ఒకటి.
ఫ్రాన్స్ దేశ నైరుతి దిశవైపున్న అట్లాంటిక్ సముద్ర తీరాన ఉన్నది ఈ కదులుతున్న ఇసుకమేట. ఆంగ్లంలో దీనిని ది గ్రేట్ డ్యూన్ ఆఫ్ పైల(The Great Dune of Pyla) అంటారు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఇసుకమేట ఇదేనని చెబుతారు. గ్రేట్ డ్యూన్ ఆఫ్ పిలాట్(Great Dune of Pilat)అనే మరోపేరుతో కూడా పిలువబడే ఈ ఇసుకమేట విశాలమైనది. ఎంత విశాలమైనదంటే 3 కిలోమీటర్ల పొడవు, 1640 అడుగుల వెడల్పు, సముద్ర మట్టానికి పైన 383 అడుగుల ఎత్తుతో బ్రహ్మాండంగా ఉంటుంది.
ఊహించని చోట ఉండటం మరియు దీని అందం ఈ ఇసుకమేటను ప్రసిద్ధ పర్యాటక రంగంగా మార్చింది. సంవత్సరానికి 10 లక్షల మంది ఈ ఇసుకమేటను చూడటానికి వస్తారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఇసుకమేట ఉదారంగా తీరం నుండి కదులుతూ భూగర్భం లోపలికి వస్తూ నిదానంగా అడవిని కప్పేస్తూ, ఇళ్ళనూ, రోడ్లనూ కూడా కప్పేస్తోంది. అట్లాంటిక్ మహాసముద్ర తీరమును కూడా కనిపించనివ్వడంలేదు. దాని కదలిక విచ్ఛిన్నమైనదిగా ఉంటున్నది. కొన్ని సార్లు అత్యంత వేగంగానూ, కొన్నిసార్లు అత్యంత నిదానంగానూ కదులుతోంది. వేగంగా అంటే సంవత్సరానికి 10 మీటర్లు ముందుకు వెళ్ళడం, నిదానం అంటే సంవత్సరానికి ఒక మీటరుకు తక్కువగా కదలడం చేస్తోంది. గత 57 సంవత్సరాలలో ఈ ఇసుకమేట 260 మీటర్ల ముందుకు జరిగింది. లేక్కలు వేసుకుంటే సగటున సంవత్సరానికి 4.9 మీటర్ల ముందుకు అన్నమాట.

ఈ ఇసుకమేట ప్రవాసం 20 ప్రైవేట్ ఆస్తులను కప్పేసింది(కబలించింది). ప్రతి సంవత్సరం తూర్పు వాలుగా ఉన్న అడవి ప్రాంతంలో 8000 చదురపు అడుగుల నేలను కప్పేసింది. ఈశాన్యమూల వైపు ఈ ఇసుకమేట 1987లో ఒక రోడ్డును ఇసుకతో కప్పుతూ 1991 న పూర్తిగా సమాధిచేసేసింది. 1928 లో అక్కడ కట్టుకున్న ఒక ఇళ్ళును పూర్తిగా ఇసుకమేట తనలో ఇముడ్చుకున్నదని సెప్టంబర్-19, 1936లో ఒక వార్తా పత్రిక తెలిపింది.
యూరప్ ఖండంలో ఇసుక మైదానములు(ఎడారులు) లేకపోవటంతో ఈ ఇసుకమేట ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఇసుక మైదానంలోని ఎత్తైన ఇసుక దిబ్బ మీద నిలబడి చూస్తే అట్లాంటిక్ మహాసముద్ర అందాలను తనివితీర చూడవచ్చు.
ఎడారులు, ఇసుకమేటలు ఆఫ్రికా ఖండంలోనూ మరియు ఆసియా ఖండంలోను ఉన్నాయని చాలామందికి తెలుసు. ఎంతోమంది అక్కడకు వెళ్ళి ఉంటారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే యూరప్ ఖండంలో ఉన్నటువంటి నమ్మశక్యం కాని ఈ సహజ దృగ్విషయం గురించి తెలిసుంటుంది. ఎడారులలో మాత్రమే చూడగలిగే పెద్ద భూగర్భ ఏర్పాటైన ఇసుకమేట, అందమైన భూగర్భ జలాలు ఉన్నటువంటి భూభాగములో ఉండటమే శాస్త్రవేత్తలతో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఫ్రాన్స్ దేశములోని ఈ ఇసుకమేటకు వెడితే సాహసగాథలలోని ఒక ప్రదేశానికి వెళ్ళినట్లు అనిపిస్తుంది.

మామూలుగా ఎడారులలో కనబడే ఇసుకమేటలు ఎడారిలో వీసే వేగమైన గాలుల వలన, గాలులు దూరంగా పొడిగా ఉండే ఇసుకను తమతో తీసుకు వస్తూ చేర్చడం వలన ఏర్పడతాయి. ఇది ఆశ్చర్య పరిచే విషయమేమి కాదు. కానీ ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం నుండి వచ్చే గాలులలో ఇసుక ఉండటానికి అవకాశమే లేదు. అలాంటప్పుడు ఈ ఇసుకమేటు ఎలా ఏర్పడింది? ఎలా కదులుతోంది? ఎలా ఇసుకను చేర్చుకుంటోంది? ఎందుకు విస్తరిస్తోంది? అడవులను, గ్రామాలను ఎందుకు కబలిస్తోంది?....ఇలాంటి ప్రశ్నలతో శాస్త్రవేత్తలను పరిశోధనకు దింపింది.
సముద్ర తీరంలోని మట్టిని పరిశోదించినప్పుడు శాస్త్రవేత్తలకు అందులో బొగ్గు వంటి పధార్ధం ఉన్నదని తెలుసుకున్నారు. ఆ మట్టిలో పరాన్నజీవులున్నాయని కనిపెట్టేరు. ఈ ఇసుకమేట ప్రారంభ దశలో ఎన్నో వేల (3500) సంవత్సరాల క్రితం చిన్న ఇసుకమేటగా ఉండి ఆ తరువాత పెద్దదవుతూ ఇప్పుడు ఇంత పెద్ద ఎడారిలా మారిందని, ఇది ఇంకా పెద్దది అవుతుందని, అడవులలోకి చొచ్చుకుపోతుందని. అలా చొచ్చుకుపోయేటప్పుడు అక్కడున్న రోడ్లను, భవనాలనూ కప్పేస్తుందని తెలిపేరు.

ఏది ఏమైనా ఇది ప్రకృతి అందించిన ఒక మిస్టరీ ప్రదేశమే అంటున్నారు.

1 comment: